ఏపీలో నేటినుంచి రాత్రి పూట కర్ఫ్యూ | Night Curfew From Today Night In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో నేటినుంచి రాత్రి పూట కర్ఫ్యూ

Apr 24 2021 8:28 PM | Updated on Apr 24 2021 9:30 PM

Night Curfew From Today Night In AP - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నేటినుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ మేరకు కర్ఫ్యూ విధివిధానాలు ఖరారు చేస్తూ  ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ ఉండనుంది. తదుపరి ఉత్తర్వుల వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. ఆస్పత్రులు, ల్యాబ్‌లు, ఫార్మసీలు, మీడియా, టెలికాం, కేబుల్ సేవలు, బంక్‌లు, విద్యుత్ సంస్థల కార్యాలయాలకు మినహాయింపు ఉంది. కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు మూసివేయాలని ఆదేశించింది. నైట్ కర్ఫ్యూ ఉల్లంఘిస్తే ఐపీసీ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Advertisement
 
Advertisement
Advertisement