రోకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త | Nellore Balajinagar Incident full information | Sakshi
Sakshi News home page

రోకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త

Jun 15 2025 5:44 AM | Updated on Jun 15 2025 5:44 AM

Nellore Balajinagar Incident full information

అనుమానం, వేధింపులే కారణం 

నెల్లూరు(క్రైమ్‌): భార్య చీటికి మాటికి గొడవపడుతుండడంతో విసిగిపోయిన భర్త రోకలిబండతో కొట్టి హతమార్చాడు. ఈ సంఘటన నెల్లూరులో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు బాలాజీనగర్‌ గౌడహాస్టల్‌ సమీపంలో ఎల్‌.విజయ్‌చంద్ర, శైలజ(46) దంపతులు నివసిస్తున్నారు. వారికి బీటెక్, పదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులున్నారు.

విజయ్‌చంద్ర ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. శైలజ తండ్రి చెన్నైలో ఉంటూ మృతిచెందారు. ఆయనకు చెందిన ఆస్తులు తమకు రావాలంటే కొంత నగదు ఖర్చు చేయాలని ఆమె భర్తకు చెప్పి అతనిచేత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుచేయించింది. దీంతో విజయ్‌చంద్ర అప్పులపాలయ్యాడు.

ఈ క్రమంలోనే భర్తపై ఆమె అనుమానం పెంచుకుని వేధించడం మొదలుపెట్టింది. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నిత్యం భర్తతో గొడవపడుతుండేది. కుమారులు ప్రశి్నస్తే వారితోనూ గొడవపడేది. శనివారం మధ్యాహ్నం విజయ్‌చంద్ర ఇంట్లోనే ఉన్నారు. కుమారులను భోజనం తీసుకు­రమ్మని బయటకు పంపించారు. ఈక్ర­మంలో దంపతుల నడుమ మరోమా­రు గొడవ జరిగింది.

ఆగ్రహానికి గురైన భర్త పక్కనే ఉన్న రోకలిబండతో శైలజ తలపై మో­దాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.  పోలీసులు ఘట­నా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించా­రు. ఘటనకు దారితీసిన పరిస్థితులను పిల­్లలను అడిగి తెలుసుకున్నారు. పెద్దకుమారు­డి ఫిర్యాదు మేరకు కేసు నమో­దు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement