సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: బాబ్జినంద

Nayee Brahmin Leader Babji Nanda Meet YS Jagan And Thanked - Sakshi

సాక్షి, అమరావతి: నాయీ బ్రాహ్మణులను కులం పేరుతో అవమానించే వారిపై చర్యలు తీసుకునేలా జీవో నంబరు 50ని ప్రభుత్వం విడుదల చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఆత్మగౌరవం కాపాడేలా జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నాయీ బ్రాహ్మణులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ‘థ్యాంక్యూ సీఎం’ అంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. 


తాజాగా ఆంధ్రప్రదేశ్ నాయిబ్రాహ్మణ నందయువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఇంటూరి బాబ్జినంద బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్రలో తమకు ఇచ్చిన మిగిలిన హామీలు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. తమ అభ్యర్థనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని బాబ్జి వెల్లడించారు. సీఎంను కలిసే అవకాశం కల్పించిన నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలుకు ధన్యవాదాలు తెలిపారు. (క్లిక్: నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top