మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నాడు-నేడు పథకం కింద నూతన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణ బాధ్యతలు కన్సల్టెంట్స్‌కి అప్పగించేందుకు.. డీఎంఈకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని సదుపాయలతో ప్రభుత్వ కాలేజీలు, ఆసుపత్రులు నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఐపీహెఎస్, ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. తక్కువ సమయం ఉండటంతో కాలేజీల నిర్మాణాలను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఈ బాధ్యతలను కన్సల్టెంట్స్‌కి అప్పగించేందుకు డీఎంఈకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తదనుగుణంగా టెండర్లను ఆహ్వానించి ఒక్కో కన్సల్టెంట్స్‌కి ఒక్కో ప్రాజెక్టును అప్పగించినట్టు డీఎంఈ తెలిపింది. నిబంధనలకు లోబడి ఈ ప్రక్రియను పూర్తి చేసినట్టు వెల్లడించింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి