సీఎం జగన్‌ పాలన దేశానికే ఆదర్శం

MP Mopidevi Said Rule Of CM Jagan Is An Ideal For The Country - Sakshi

ప్రకాశం జిల్లా మత్స్యకారుల సమస్య పరిష్కరిస్తాం

ఎంపీ మోపిదేవి వెంకటరమణ

సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన దేశానికే దిశా నిర్దేశమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు కన్వెన్షన్ హాల్‌లో జరిగిన చాత్తాద శ్రీవైష్ణవ వెల్ఫేర్, డవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కులాలకు సమన్యాయం చేస్తూ వారి అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. (చదవండి: రేపు సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన)

‘‘రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉండగా వాటిలో కేవలం నాలుగైదు కులాలే మాత్రమే రాజకీయంగా, ఆర్థికంగా మనుగడ సాగిస్తున్నాయి. వైఎస్‌ జగన్ పాదయాత్రలో బీసీ కుల సంఘాల నాయకుల సమస్యలు విని వారి స్థితిగతులు తెలుసుకున్నారు. బీసీ కులంలోని అట్టడుగు వర్గాలకు కూడా ఆర్థిక, రాజకీయంగా సమన్యాయం కల్పించేందుకు 139 కులాలని కలుపుకుంటూ 56 కార్పొరేషన్లు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. సీఎం జగన్ నిర్ణయాన్ని దేశంలోనే పలు రాష్ట్రాలు ఆదర్శప్రాయంగా తీసుకుంటున్నాయని’’ మోపిదేవి పేర్కొన్నారు. (చదవండి: ‘రాజ్యాంగ వ్యతిరేక శక్తులెవరో తేల్చుకుంటాం’)

మత్స్యకారుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని ఎంపీ మోపిదేవి తెలిపారు. మత్స్య సంపద ఉత్పత్తిలో ఏపీ మొదటిస్థానంలో ఉందని పేర్కొన్నారు. చేపలు వేటాడే విధానంలో చిన్న చిన్న సమస్యలున్నాయి. ఐలా వలలతో వేటాడొద్దని ముందే చెప్పాం. అవగాహన లేకపోవడంతో ఐలా వలలు వాడుతున్నారని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలో మత్స్యకారుల మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ మోపిదేవి పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top