విస్తరిస్తున్న రుతుపవనాలు | Monsoons Expanding | Sakshi
Sakshi News home page

విస్తరిస్తున్న రుతుపవనాలు

Jun 8 2024 5:27 AM | Updated on Jun 8 2024 5:27 AM

Monsoons Expanding

మరో మూడురోజులు వర్షాలు

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వానలు కొనసాగనున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. 

వచ్చే రెండు మూడు రోజుల్లో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన భాగాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 

ఫలితంగా శనివారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 

అలాగే ఆదివారం అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమ­య్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement