వాతావరణశాఖ అలర్ట్.. ఏపీలో భారీ వర్షాలు | Moderate rains today | Sakshi
Sakshi News home page

వాతావరణశాఖ అలర్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Aug 12 2023 3:26 AM | Updated on Aug 12 2023 8:45 AM

Moderate rains today - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో శనివారం ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. సగటు సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఆంధ్రప్రదేశ్‌ తీరానికి ఆనుకుని ఉంది. దీనికి తో­డు సముద్రమట్టానికి 0.9 కి.మీ.ల ఎత్తులో ఒక ద్రోణి అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్‌ ప్రాంతం వరకు కొనసాగుతున్నది. 

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పగటిపూట ఎండతీవ్రత, ఉక్కపోత ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement