జగనన్న తగ్గేదేలే.. చంద్రబాబు గెలిచేదేలే: మంత్రి రోజా | Minister Roja Satirical Comments On TDP And Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

జగనన్న తగ్గేదేలే.. చంద్రబాబు గెలిచేదేలే: మంత్రి రోజా

Oct 1 2022 9:05 PM | Updated on Oct 1 2022 9:16 PM

Minister Roja Satirical Comments On TDP And Chandrababu Naidu - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. ఎన్టీఆర్‌ గుర్తింపు కోసం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ చేసిందేమీటి అని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. కాగా, రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యం మైదానంలో నిర్వహించిన మహిళా సాధికార ఉత్సవాల్లో మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ..‘ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. ఎన్టీఆర్‌ పేరు ఒక జిల్లాలకు పెట్టి వైసీపీ ఘనంగా గుర్తించింది. ఎన్టీఆర్ గుర్తింపు  కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్  చేసింది ఏమిటి?. అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి వ్యహరిస్తున్నారు. ఆయనను త్వరగా పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. లేదంటే ప్రజలు రాళ్లతో కొడతారు. ఏ కష్టం వచ్చినా జగనన్న ఉన్నాడని భరోసాతో రాష్ట్ర మహిళలు ధైర్యంగా ఉన్నారు. మహిళ తన ఇంట్లో ధైర్యంగా ఉందంటే ఈ రోజున జగనన్న ఇచ్చిన ధైర్యమే. జగనన్న తగ్గేదేలే.. చంద్రబాబు గెలిచేదేలే’ అని అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement