చంద్రబాబు కాదు.. స్టే బాబు: కొడాలి నాని | Minister Kodali Nani Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు

Mar 20 2021 12:26 PM | Updated on Mar 20 2021 5:17 PM

Minister Kodali Nani Comments On Chandrababu - Sakshi

చంద్రబాబు కాదు.. స్టే బాబు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటారని దుయ్యబట్టారు.

సాక్షి, విజయవాడ: విచారణ ఎదుర్కోలేని ‘పిరికిపంద’గా ప్రతిపక్ష నేత చంద్రబాబును పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అభివర్ణించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కాదు.. స్టే బాబు అంటూ ఎద్దేవా చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటారని దుయ్యబట్టారు. స్టేలు తాత్కాలికమేనని.. చంద్రబాబుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదన్నారు. తిరుపతి, జడ్పీ ఎన్నికల్లో కూడా ఆయనకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యేలా భయంకరమైన శిక్ష వేస్తారని కొడాలి నాని అన్నారు.
చదవండి:
నిమ్మగడ్డ దాగుడుమూతలు
చంద్రబాబు – నారాయణపై విచారణకు బ్రేక్‌ 4 వారాలు ‘స్టే’

Advertisement
 
Advertisement
Advertisement