పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ నష్టం ఎవరి పాపం?: అంబటి

Minister Ambati Rambabu Slams On TDP Over Polavaram Project Diaphragm Wall - Sakshi

సాక్షి, విజయవాడ: పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ నష్టం ఎవరి పాపం? అని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్‌అండ్‌ఆర్‌ పూర్తి కాకపోవడంతో 56 గ్రామాలు మునిగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాపర్‌ డ్యామ్‌ సగంలో ఉండగానే డయాఫ్రమ్‌ వాల్‌ కట్టారని తెలిపారు. టీడీపీ చేసిన చారిత్రక తప్పిదం ఇదేనని మండిపడ్డారు. చంద్రబాబు మీడియా పోలవరంపై అవాస్తవలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. డయాఫ్రమ్‌ వాల్ తమ వల్ల దెబ్బతిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు 2018లోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పలేదా? అని సూటిగా ప్రశ్నించారు.

అనుభవం ఉన్న టీడీపీ వాళ్లు ఎందుకు పూర్తి చెయ్యలేదని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక లోపం వల్లనే డయాఫ్రమ్‌ వాల్ దెబ్బతిందని తెలిపారు. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ పూర్తి చెయ్యకుండా అది కట్టారని మండిపడ్డారు. అన్ని ఒకేసారి కట్టే ప్రయత్నం వల్లే దెబ్బతిందని అన్నారు. ఎగువ, దిగువ కాపర్ డ్యామ్‌లు కట్టకుండా డయాఫ్రమ్‌ వాల్ కట్టారని అందుకే దెబ్బతిందని తెలిపారు. వరదలకు ముందే దాన్ని క్లోజ్ చేస్తే గ్రామాలకు ముంపు వస్తుందని అన్నారు. తాము ఆర్అండ్ఆర్ పూర్తి చేసి కాపర్‌డ్యామ్‌ క్లోజ్ చేశామని తెలిపారు. కాపర్‌ డ్యామ్‌ పూర్తి కాకుండా డయాఫ్రమ్‌ వాల్ కట్టడం టీడీపీ చేసిన చారిత్రక తప్పిదం కాదా? అని అని సూటిగా ప్రశ్నించారు.

చదవండి:  తిరుపతిని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top