న్యాయం చేయమంటే... మాపైనే ఎదురు కేసు పెట్టారు | Marripudi SI Attack On Woman | Sakshi
Sakshi News home page

న్యాయం చేయమంటే... మాపైనే ఎదురు కేసు పెట్టారు

Jun 4 2025 9:00 AM | Updated on Jun 4 2025 9:00 AM

 Marripudi SI Attack On Woman

జాళ్లపాలేనికి చెందిన బండి చంద్రమ్మ, మారంరెడ్డి ఆదిలక్ష్మి 

ఒంగోలు టాస్‌క్‌ఫోర్స్‌/ఒంగోలు టౌన్‌: ఎస్సై దురు­సు­గా ప్రవర్తించి దాడి చేశారని, న్యాయం చేయాలని ఎస్పీకి మొరపెట్టుకుంటే... విధులకు ఆటంకం కలిగించారంటూ తమపైనే ఎదురుకేసు పెట్టారని జాళ్లపా­లెం ఘటనలో బాధితులు వాపోతున్నారు. ప్రకా­శం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు బండి చంద్రమ్మ మాట్లాడుతూ ‘నేను జాళ్లపాలెంలోని మా అన్న మారంరెడ్డి కొండలరావు కిరాణాషాపులో ఉండగా మర్రిపూడి ఎస్సై రమేశ్‌బాబు షాపు ఆలయాల్లో దొంగతనాలు జరిగాయి... మీ షాపులో సీసీ కెమెరా ఫుటేజ్‌ పరిశీలించాలని అడిగారు. 

నాకు తెలియదని, మా అన్న షాపులో లేడని చెప్పా. మా అన్నకు ఫోన్‌ చేయమన్నారు. దీంతో ఫోన్‌చేసి ఎస్సై­కి ఇచ్చా. తాను ఊళ్లో లేనని, పెన్‌డ్రైవ్‌ ఇస్తే కాపీ చేసి ఇస్తానని అన్నయ్య చెప్పాడు. దీంతో తాను ఎస్సై రమేశ్‌బాబునని చెప్పడంతో... సీసీ టీవీ ఫుటేజ్‌ ఇ­చ్చే­ది లేదనీ, గతంలో తనపై అక్రమ కేసు బనాయించే ప్రయత్నం చేశారని, కొండపి ఎస్సైకి మాత్రమే ఇస్తానని అన్నయ్య చెప్పాడు. దీంతో ఎస్సై రమేశ్‌బాబు ఫోన్‌ పెట్టేసి సీసీ టీవీ ఫుటేజ్‌ చూడాలంటూ లో­పలికి వచ్చే ప్రయత్నం చేశారు. 

నేను అడ్డుకునే య­త్నం చేయగా నన్ను నెట్టుకుంటూ మేడపైకెళ్లి సెల్‌­ఫో­న్, రెండు పెన్‌డ్రైవ్‌లు, సీసీ కెమెరా యూ­నిట్‌ తీసు­కెళ్లిపోయారు’ అని చెప్పారు. కొండలరావు అన్న కూతురు మారంరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ‘నేను లా చదువుతున్నా. జడ్జి పరీక్షకు సిద్ధమయ్యేందుకు మేడమీద చదువుకుంటున్నా. ఆ సమయంలో మా అత్త చంద్రమ్మ మేడపైకి వచి్చంది. వెనకాలే ఎస్సై రమేశ్‌బాబు వచ్చి సీసీ కెమెరాకు సంబంధించి మెటీరియల్‌ తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచారు. మేమిద్దరం అడ్డుకునే ప్రయత్నం చేయగా, మాపై దాడిచేసి మరీ మెటీరియల్‌ని తీసుకుపోయారు’ అని తెలిపారు. 

బాధిత మహిళలపైనే కేసు.. 
ఈ ఘటనపై ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ స్పందించా­రు. సీసీ ఫుటేజీని పరిశీలించకుండా ఎస్సై రమేశ్‌బాబు విధులకు ఆటంకం కలిగించిన బండి చంద్ర­మ్మ, మారంరెడ్డి ఆదిలక్ష్మిలపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఎస్సైను చంద్రమ్మ అడ్డుకోవడమే కాకుండా పదేపదే పక్కకు నెట్టి వేసిందని చెప్పారు. 

ఈ ఘటన వీడియోను మారెడ్డి కొండలరావు ఉద్దేశపూర్వకంగా రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టి పోలీసులను అప్రతిష్ట పాల్జేశారని పేర్కొన్నారు. డ్యూటీలో ఉన్న పోలీసులను అడ్డుకున్నందుకే కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ఇదిలావుండగా మర్రిపూడి ఎస్సై రమేశ్‌­బాబు వ్యవహారశైలిపై కొండలరావు జాతీ­య మా­నవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement