మట్టి మాఫియాకు యువకుడు బలి | Man died after being hit by a tractor truck recently | Sakshi
Sakshi News home page

మట్టి మాఫియాకు యువకుడు బలి

Sep 7 2026 3:36 AM | Updated on Sep 7 2026 3:36 AM

Man died after being hit by a tractor truck recently

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఏఎం పుత్తూరు వద్ద ఘటన  

ఇటీవల ఇదే ట్రాక్టర్‌ ట్రక్‌ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

ఏర్పేడు: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఏఎం పుత్తూరు వద్ద బైక్‌పై వెళుతున్న ఓ యువకుడిని మట్టి లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. శ్రీకాళహస్తి టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తొట్టంబేడు మండలం గుండేలుగుంటకు చెందిన వెంకటసుబ్బారెడ్డి, సుబ్బరత్నమ్మ కుమారుడు చంద్రశేఖర్‌ (25) ఆదివారం బైక్‌పై శ్రీకాళహస్తికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. పట్టణ సమీపంలోని ఏఎం పుత్తూరు వద్ద ఎదురుగా మట్టి లోడుతో అతివేగంగా వస్తున్న ట్రాక్టర్‌ బలంగా ఢీకొట్టింది. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చంద్రశేఖర్‌ శ్రీకాళహస్తి ఆలయంలో స్వచ్ఛంద సేవకుడిగా చిన్నపాటి ఎలక్ట్రికల్‌ పనులు చేస్తున్నాడు. 

ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారీలో ఉండగా, ట్రాక్టర్‌కు కనీసం నంబరు ప్లేట్‌ కూడా లేకపోవడం విశేషం. ప్రమాద విషయం తెలుసుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి చేరుకుని మృతుని కుటుంబీకులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అక్కడున్న వారిని ఆరా తీశారు. మృతుని తల్లిదండ్రులను ఓదార్చారు. ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని తీరుతో శ్రీకాళహస్తిలోని ప్రతి గ్రామంలోనూ మట్టి, ఇసుక, గ్రావెల్‌ అక్రమ తరలింపు యథేచ్ఛగా జరుగుతోందన్నారు. 

నంబరు ప్లేట్లు లేకుండా ట్రాక్టర్లు నడుపుతుంటే ఆర్‌టీఏ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిం­చారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి మైనింగ్‌ మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిందిపోయి, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కాగా.. శ్రీకాళహస్తి మండలం నారాయణపురానికి చెందిన ఉపాధ్యాయుడు కావలి మురళి జూలై 1వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి బైక్‌పై వస్తుండగా బైపాస్‌రోడ్డులోని అండర్‌పాస్‌ వంతెన వద్ద మట్టి లోడుతో వెళుతున్న ఇదే ట్రాక్టర్‌ ట్రక్‌ ఢీకొట్టి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement