రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తి అరెస్ట్‌ | Man arrested for fraud by promising railway jobs | Sakshi
Sakshi News home page

రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తి అరెస్ట్‌

Oct 6 2026 5:53 AM | Updated on Oct 6 2026 5:53 AM

Man arrested for fraud by promising railway jobs

కంభం: రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని మార్కాపురం జిల్లా కంభం పోలీసులు అరెస్టు చేశారు. మార్కాపురం డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ సోమవారం మీడియాకి తెలిపిన మేరకు ఈ కేసు వివరాలు.. విజయనగరం జిల్లా గజపతినగరానికి చెందిన చెరుకూరి శ్రీను మూడునెలల కిందట కంభంలో ఇల్లు అద్దెకు తీసుకొని చిన్న కొట్టు పెట్టాడు. రైల్వేలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. 

రైల్వేస్టేషన్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పెద్దనల్లకాల్వ గ్రామానికి చెందిన పిల్లి చరణ్‌రాజ్‌ వద్ద రూ.66,500, కారులో చిత్తూరు వెళ్లి వస్తూ కదిరి దగ్గర లిఫ్ట్‌ అడిగిన మహిళ వద్ద రూ.4,88,000, కంభం రిలయన్స్‌ మార్ట్‌లో పనిచేస్తున్న గెనికె కళ్యాణ్‌ వద్ద రూ.53 వేలు, ఏబీ ఎంటర్‌ప్రైజస్‌ యజమాని వద్ద సుమారు రూ.లక్ష తీసుకుని వారిని మో­సం చేశాడు. 

తర్వాత మొహం చాటేయడంతో బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి రూ.3.20 లక్షలు నగదు, 2 సెల్‌ఫోన్లు, ఒక కంప్యూటర్‌.. మొత్తం రూ.4.50 లక్షల విలువైన సొత్తు­ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో కొప్పుల భరత్‌కుమార్‌­రెడ్డి వద్ద రూ.4.88 లక్షలు, ఇంకొల్లుకు చెందిన శాలె­మురాజు వద్ద రూ.6.28 లక్షలు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గతంలో మోసా­లకు సంబంధించి అతడిపై భీమిలి, ఎస్‌.రాయవరం, పెద్దాపురంలలో ఒక్కోకేసు, ఏలూరులో రెండుకేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నల్లగొండ జైలుకు కూడా వెళ్లాడు. విడుదలయ్యాక కంభంలో మోసాలు మొదలుపెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement