
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల లక్ష్మీ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్స్‌గా తన నియామకాన్ని రద్దు చేయటాన్ని హైకోర్టులో ఆమె సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు నేడు(గురువారం) విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. 2026 వరకు రాజ్యాంగబద్ధ హోదాలో పదవీకాలం ఉన్నప్పటికి, రాజకీయ ప్రయోజనాలతో తొలగించారని కోర్టుకు తెలిపారు.
2023లో సడలించిన చట్టం ప్రకారం అయిదు సంవత్సరాల కాల పరిమితి నుంచి రెండు సంవత్సరాల కాల పరిమితికి పరిమితం చేయటంతో పిటిషనర్ కాల పరిమితి ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే గజ్జల లక్ష్మీని చైర్ పర్సన్‌గాతొలగించారని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులను ఇలా తొలగించటం నిబంధనలకు వ్యతిరేకమని చెప్పారు.
మరోవైపు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. గత చైర్‌పర్సన్ పదవి కాలం ఆగస్టుతో ముగిసిపోయినందున పిటిషనర్ నియామకం కూడా రద్దయినట్టుగా భావించాలని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే నియమించబడ్డార,ని రెండు సంవత్సరాల కొనసాగింపు కోరే హక్కు ఆమెకు లేదని చెప్పారు. ఇరువురి వాదనల అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
