16 నుంచి శ్రీశైలంలో మహాకుంభాభిషేకం | Mahakumbhabhishekam in Srisailam from 16 | Sakshi
Sakshi News home page

16 నుంచి శ్రీశైలంలో మహాకుంభాభిషేకం

Feb 9 2024 4:45 AM | Updated on Feb 9 2024 4:45 AM

Mahakumbhabhishekam in Srisailam from 16 - Sakshi

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైలంలో ఈ నెల 16–21 వరకు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ క్రతువు జరిపించాలని ఆలయాధికారులు భావించినా పలు కారణాలతో ఐదేళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది కుంభాభిషేకంతో పాటు శివాజీ గోపురానికి కూడా కలశ ప్రతిష్టాపన నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కుంభాభిషేక పనులు కూడా సిద్ధం చేసినా అనుకోని విధంగా వాయిదా పడింది.

ఆ తరువాత ఓ హిందూ ధార్మిక సంస్థ పేరుతో కుంభాభిషేక నిర్వహణపై హైకోర్టుకు వెళ్లారు. కుంభాభిషేకాన్ని ఈ నెల 16– 21 వరకు నిర్వహించాలని హైకోర్టు సూచించడంతో అధికారులు కుంభాభిషేకానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మల్లికార్జున స్వామి గర్భగుడి, ఆలయంలో ఉన్న 4 గోపురాలతో పాటు అమ్మవారి ఆలయం వద్దనున్న గోపురానికి, ఉపాలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.

శిథిలావస్థకు చేరి కూలిపోయిన శివాజీ గోపురాన్ని దేవస్థానం పునఃనిర్మించింది. 2018లో ఈ నిర్మాణం పూర్త­యి­నప్పటికీ ఇంతవరకు కలశ ప్రతిష్టాపన జరగలేదు. ఐదేళ్లుగా కలశ ప్రతిష్టాపనకు గోపురం నోచుకోలేదు. కుంభాభిషేకం నిర్వహణ సమయంలోనే కలశ ప్రతిష్టాపన, కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో డి.పెద్దిరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement