ఆధ్యాత్మిక శోభ.. అజ‘రామ’రం | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక శోభ.. అజ‘రామ’రం

Published Fri, Mar 22 2024 5:17 AM

Madavedhus around Ontimitta temple - Sakshi

సర్కారు కృషితో అందాల సిరిగా ఏకశిలానగరం 

ఒంటిమిట్ట ఆలయం చుట్టూ మాడవీధులు

ఉద్యాన వనాలతో కొత్త కళ 

యాత్రికులకు అధునాతన వసతి సౌకర్యాలు 

పుష్కరిణికి కొంగొత్త హంగులు 

ఏకశిలపై వెలసిన ఆధ్యాత్మిక నగరి..  అందాల పురి.. ఆంధ్ర అయోధ్య  ఒంటిమిట్ట కోదండ రామాలయం  కొత్త కళతో మిలమిలా మెరిసిపోతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరఫున అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్టకు అధికారిక గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధిని అటకెక్కించింది.  వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఇది అద్భుత క్షేత్రంగా ఆవిష్కృతమైంది. సుమనోహర మాడవీధులు, సుందర ఉద్యానవనాలతో అజరామర కోవెలై  విరాజిల్లుతోంది.  – సాక్షి, రాయచోటి

రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు 
2019 తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో సుమారు రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రధానంగా శాశ్వత కల్యాణ మండపంతోపాటు చుట్టూ ప్రహరీ నిర్మాణం, భక్తులకు విశ్రాంతి గదులు, వీవీఐపీల అతిథి గృహాలు, కొండపై పార్వేట మండపం, పుష్కరిణి, ఆలయ సమీ­పంలో రామసేతు కోనేరు ఆధునికీకరణ, రామాల­యం చుట్టూ మాడవీధుల నిర్మాణాలు జరిగాయి. ప­చ్చ­దనంతో కూడిన ఉద్యాన వనాలతో కోవెల కొత్త అందాలు సంతరించుకుంది.

ఆలయంలో ప్రత్యే­­కమైన బండరాయితో చప్టా ఏర్పాటైంది. గుడి వెలుపల మండపం నిర్మితమైంది. నూతన రథం సమకూరింది. ఆలయం చుట్టూ ఆక్రమ­ణ­లు తొలగించారు. కొత్త రోడ్ల నిర్మాణాలతో ఏకశిలానగరం ముగ్ధమనోహరమై ఆకర్షిస్తోంది. క్షేత్రంలో జాంబవంతుడు, పోతన, హనుమంతుని విగ్రహాల ఏర్పాటుకూ వేగంగా సన్నాహాలు చేస్తు­న్నా­రు. శ్రీరామ ఎత్తిపోతల పథకంలో భాగంగా సోమశిల నుంచి ఒంటిమిట్ట చెరువుకు పైపులైన్‌ ద్వారా నీటిని అందించేలా చేపట్టిన పనులూ పూర్తయ్యాయి. 

పౌర్ణమి వెలుగులో స్వామి కల్యాణం 
ఒంటిమిట్టలో ఏటా శ్రీరామనవమిని పురస్కరించు­కుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.  ఈ కోదండ రాము­ని కల్యాణ ఘట్టం పౌర్ణమి వెన్నెల్లో చంద్రుడి సాక్షిగా నిర్వహించడం ఆనవాయితీ. గతంలో కల్యా­ణ వేదిక అందుబాటులోలేక అనేక ఇబ్బందులు ఎదుర­య్యాయి. సుమారు 60 ఎకరాల విస్త్రీర్ణంలో కల్యా­ణ వేదికకు స్థలాన్ని కేటాయించడంతోపాటు అందులో శాశ్వత మండప నిర్మాణాలు పూర్తి చేయడంతో ఏటా స్వామి  కల్యాణం  నిర్వహిస్తూ వస్తున్నారు. టీటీ­డీ ఆ«ధ్వర్యంలో మధ్యాహ్న సమయంలో భక్తుల­కు నిత్యాన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. రెండో శనివా­రం తిరుమల లడ్డూ ప్రసాదాన్నీ విక్రయిస్తున్నారు.

టీడీపీ హయాంలో అంతంత మాత్రమే 
2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 2015 సెపె్టంబరు 9న ఆలయాన్ని టీటీడీలో విలీనం చేశారు. తర్వాత కాలంలోనూ అభివృద్ధి పనులు అంత వేగంగా జరగలేదు. పైగా 2018లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్వామి కల్యాణం రోజున ప్రకృతి విపత్తుతో అనేక దుష్పరిణామాలు చోటుచేసుకున్నాయి.

కల్యాణం రోజు ఇంతటి అపశృతి  చరిత్రలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. 2014 నుంచి స్వామికి కల్యాణం రోజున పట్టు వ్రస్తాలు సమర్పించేందుకు స్వయంగా సీఎం హోదాలో అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చినా అభివృద్ధి దిశగా అంత ఆలోచనచేయలేదని విమర్శిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా టీటీడీ అధికారుల ద్వారా అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేసి భక్తులకు అన్ని వసతులూ కల్పించింది.

అభివృద్ధితో కళకళ 
చిన్నతనం నుంచి చూస్తున్న ఒంటిమిట్ట శ్రీకోదండ రామాల­యం గత నాలుగేళ్లలో నమ్మలేనంతగా మారిపోయింది. ఆలయాన్ని చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి. ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసింది. గుడి కళకళలాడుతోంది. భక్తులకు సకల వసతులూ సమకూరాయి.  – శ్రీనివాసులు, ఒంటిమిట్ట 

రామయ్యకు రాజయోగం 
 నేను కొన్నేళ్లు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం చైర్మన్‌గా పనిచేశాను.  ఇతిహాసాల్లోనూ ఒంటిమిట్ట రామయ్యకు చరిత్ర ఉంది. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ఆలయం గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్సార్‌ సీపీ సర్కారు హయాంలో రామయ్యకు రాజయోగం పట్టింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.   – ముమ్మడి నారాయణరెడ్డి,   పెన్నపేరూరు, ఒంటిమిట్ట మండలం  

అద్భుత క్షేత్రమైంది  
ఈ రామాలయం టీటీడీ ఆధ్వ­ర్యంలో అద్భుత క్షేత్రంగా ఆవిష్కృతమైంది. భక్తులకు కావాల్సిన విడి­ది గృహం సమకూరింది.  స్వామి శాశ్వత కల్యాణ వేదిక నిర్మితమైంది. పచ్చ­ని నందన వనాలు కనువిందు చేస్తున్నాయి. వీవీఐపీ బిల్డింగ్, అన్నప్రసాద కేంద్రం, నూతనంగా నిర్మించిన పార్వేటి మండపంతో ఆలయం అభివృద్ధి బాట­పట్టింది. పుష్కరిణి, రామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలవ రాతి బండలు, రామతీ­ర్థం భక్తులను ఆకట్టు్టకుంటున్నాయి. – నటేష్ బాబు, డిప్యూటీ ఈఓ, ఒంటిమిట్ట

Advertisement
Advertisement