మదనపల్లె హత్య: నిందితులకు బెయిల్‌ | Sakshi
Sakshi News home page

మదనపల్లె హత్య: నిందితులకు బెయిల్‌

Published Tue, Apr 27 2021 7:25 PM

Madanapalle Murder Case: Court Granted Bail Accused Couple - Sakshi

చిత్తూరు: దేశ్యవాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె హత్య కేసులో నిందితులకు మంగళవారం బెయిల్‌ మంజూరైంది. మూఢనమ్మకంతో తన ఇద్దరు కుమార్తెలు (అలేఖ్య, సాయిదివ్య)ను సొంత తల్లే జనవరి 24న దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రధాన నిందితురాలు తల్లి పద్మజ ఉండగా తండ్రి పురుషోత్తం కూడా అరెస్టయ్యాడు. జైలుకు వెళ్లిన వారికి మదనపల్లి 2వ అదనపు జిల్లా జడ్జి వారికి బెయిల్‌ మంజూరు చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన పద్మజ, పురుషోత్తం మానసిక సమస్యలతో బాధపడుతున్నారని భావించి వారిని మొదట తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం విశాఖపట్టణంలోని మానసిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స  అందించారు. చికిత్స అనంతరం కొద్ది రోజుల తర్వాత వారిని మదనపల్లె సబ్‌ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆ దంపతులు అదే జైలులో ఉంటున్నారు. అయితే కేసు నమోదై 90 రోజులు పూర్తవడంతో నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.

చదవండి: 
పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్‌స్టర్‌.. రెండు ప్రాణాలు బలి

 ‘బరాత్‌’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌

Advertisement
 
Advertisement