డ్రగ్స్‌ బారి నుంచి యువత, మహిళలకు విముక్తి | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ బారి నుంచి యువత, మహిళలకు విముక్తి

Published Fri, Jul 7 2023 4:41 AM

Liberation of youth and women from the clutches of drugs - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో మాదకద్రవ్యాల బారి నుంచి యువత, మహిళలను విముక్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ తాజాగా పేర్కొంది. జాతీయ స్థాయిలో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కింద మాదకద్రవ్యాల వినియోగం నుంచి యువత, మహిళలను దూరం చేయడానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించింది.

నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కింద దేశంలో అత్యధికంగా మాదకద్ర వ్యాలు వినియోగించే 372 జిల్లాల్లో 8 వేల మంది యువ వలంటీర్ల ద్వారా పెద్ద ఎత్తున కమ్యూనిటీ ఔట్‌రీచ్‌ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపింది. తద్వారా 3.12 కోట్ల మంది యువతను మాదకద్ర వ్యాల వినియోగం నుంచి దూరం చేసినట్లు వెల్లడించింది.

అలాగే 2.06 కోట్ల మంది మహిళలకు కూడా విముక్తి కల్పించినట్టు పేర్కొంది. ఇందుకు కార్యా చరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపింది. మాదకద్రవ్యాలకు బానిస లైన వారి కోసం 340 సమీకృత పునరావాస కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని వివరించింది. చికిత్స అందించడ మే కాకుండా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. 

డీఅడిక్షన్‌ కోసం హెల్ప్‌లైన్‌ 
మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక డీఅడిక్షన్‌ కేంద్రా లకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తోందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 46 డ్రగ్స్‌ చికిత్సలను అందిస్తున్నట్టు తెలిపింది. అలాగే ప్రాథమిక కౌన్సెలింగ్, తక్షణ సహాయం అందించడానికి డీఅడిక్షన్‌ కోసం టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ 14446 ఏర్పాటు చేసినట్టు పేర్కొంది.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ డిఫెన్స్‌తో పాటు రాష్ట్ర విద్యా శిక్షణ, పరిశోధన సంస్థలు, కేంద్రీయ విద్యా లయాల ద్వారా క్రమం తప్పకుండా మాదకద్రవ్యా ల వినియోగం వల్ల కలిగే నష్టాలు, హానిపై అవ గాహన కల్పిస్తున్నామని తెలిపింది. అలాగే విద్యా ర్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సెన్సిటైజే షన్‌ సెషన్‌లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

గత మూడేళ్లలో డ్రగ్స్‌ వినియో గిస్తున్న వారిపై 1,24,891 కేసులను నమోదు చేయ డంతో పాటు 1,30,458 మందిని అరెస్టు చేసినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. 18 ఏళ్లలోపు డ్రగ్స్‌ వినియోగిస్తూ అరెస్టు అయిన వారి గణాంకాలను పరిశీలిస్తే.. పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నట్లు బాంబుపేల్చింది.

గత మూడేళ్లలో 18 ఏళ్లలోపు డ్రగ్స్‌ వినియోగిస్తున్న 935 మంది పురుషులు అరెస్టు కాగా అదే సమయంలో 9,077 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారని పేర్కొంది. 2018 సర్వే ప్రకారం.. దేశంలో 10 నుంచి 17 ఏళ్లలోపు 86 లక్షల మంది పిల్లలు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు తేలిందని వెల్లడించింది. 

Advertisement
Advertisement