నెల్లూరులో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం

సాక్షి, నెల్లూరు: జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంలోని పలుచోట్ల రోడ్లు, లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు పొంగిపొర్లుతోంది. భారీ వర్షానికి కోవూరు ప్రాంతంలో నారుమళ్లు నీటి మునిగియి. మాగుంట లే ఔట్‌లో అండర్ బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న నీటిలో ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోయింది. భారీ వర్షాలకు అస్తవ్యస్తమైన పలు ప్రాంతాలు, రూరల్ పరిధి డివిజన్లలో స్థానిక వెఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గురువారం పర్యటించారు. రైల్వే పనులు వల్లే ఈ పరిస్థితి ఎదురైందని, కార్పొరేషన్ అధికారులతో రైల్వే శాఖ సమన్వయం చేసుకోకుండా పనులు చేస్తుండటం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. వర్షపు నీళ్లు సాధ్యమైనంత త్వరగా బయటకు పంపించి, పరిస్థితిని పునరుద్ధరిస్తాం శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి