మదనపల్లి గ్లోబల్‌ ఆస్పత్రి సీజ్‌ | Kidney Racket: Global Hospital In madanapalle Seized | Sakshi
Sakshi News home page

మదనపల్లి గ్లోబల్‌ ఆస్పత్రి సీజ్‌

Nov 12 2025 6:17 PM | Updated on Nov 12 2025 6:23 PM

Kidney Racket: Global Hospital In madanapalle Seized

మదనపల్లి: అన్నమయ్య .జిల్లాలోని మదనపల్లి గ్లోబల్‌ ఆస్పత్రిని సీజ్‌ చేశారు.  కిడ్నీ రాకెట్‌ దందా నేపథ్యంలో చర్యలు చేపట్టిన అధికారులు.. గ్లోబల్‌ ఆస్పత్రిని సీజ్‌ చేశారు. అదే సమయంలో గ్లోబల్‌ ఆస్పత్రిలో రికార్డులను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

మంగళవారం( నవంబర్‌ 11వ తేదీ) మదనపల్లిలో కిడ్నీ రాకెట్ బయటపడిన సంగతి తెలిసిందే. మహిళలను విశాఖ నుండి మదనపల్లికి తీసుకొచ్చి కిడ్నీలను తొలగిస్తున్న ఘటన సంచలనం రేపింది  యమున అనే మహిళ మిస్సింగ్‌ కేసు ఎపిసోడ్‌తో కిడ్నీ రాకెట్‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఆమె భర్త మధుబాబు 112  తిరుపతికి కాల్‌ చేయగా, మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ జరిగినట్లు గుర్తించి ఫోటోలు పోలీస్ స్టేషన్‌కు ఎండార్స్‌ చేశారు పోలీసులు.

సెల్ ఫోన్ సిగ్నల్  ఆధారంగా యమున మొబైల్‌ను ట్రేస్‌ చేశారు  పోలీసులు.  దాంతో గ్లోబల్ హాస్పిటల్‌లో పద్మ కిడ్నీలను  తొలగించే సమయంలో ఆమె మృతి చెందిన విషయం బయటపడింది.  ఇద్దరు మహిళలను మదనపల్లి గ్లోబల్‌ ఆస్పత్రికి తీసుకురాగా, యమున అనే మహిళకు కిడ్నీ తొలగిస్తున్న సమయంలో మృత్యువాడ పడ్డారు. నిన్ననే గ్లోబల్‌ ఆస్పత్రి వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, ఈరోజు  ఆ ఆస్పత్రని సీజ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement