నగ్న వీడియోలతో వేధింపులు: కరాటే కల్యాణి అండతో ఫిర్యాదు

Karate Kalyani Supports Young Girl, Filed Complaint Against Pastor - Sakshi

ప్రేమ పేరుతో మోసం

కరాటే కల్యాణిని ఆశ్రయించిన బాధితురాలు

ఆపై పోలీసులకు ఫిర్యాదు

సాక్షి, కంబాలచెరువు (తూర్పు గోదావరి): ఆల్కాట్‌ గార్డెన్స్‌ ప్రాంతంలోని ఒలీవల మందిరం పాస్టర్‌ షారోన్‌ కుమార్‌ తనను మోసం చేశాడని కడియం మండలం రెడ్డిపడల్లి గ్రామానికి చెందిన మద్దుకూరి ప్రింయాక మంగళవారం రెండోపట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియాంక ఏడేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి ఒలీవల చర్చికి వెళ్తోంది. అక్కడ పాస్టర్‌ షారోన్‌ కుమార్‌ ఏకాంత ప్రార్థనలను ప్రోత్సహించేవాడు.

తన భార్యతో విడాకులు అయిపోతున్నాయని, నిన్ను ప్రేమిస్తున్నానని నమ్మబలికి శారీరకంగా లోబర్చుకున్నాడు. నగ్నంగా వీడియోలు తీసి తనవద్ద ఉంచుకున్నాడు. ఇప్పుడు ఆ ఫొటోలను బహిర్గతం చేస్తానని భయపెడుతున్నాడు. దీంతో కొందరి సహకారంతో సినీ ఆర్టిస్ట్‌ కరాటే కల్యాణిని కలిసి తన బాధ చెప్పుకున్నానని, ఆమె ధైర్యంతో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశానని ప్రియాంక తెలిపారు.

చదవండి: దారుణం: కాలిన గాయాలతో నగ్నంగా రోడ్డుపై విద్యార్థిని

వరకట్నం వేధింపులు.. అల్లుడ్ని చెట్టుకు కట్టేసి..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top