ఏపీ హైకోర్టుకి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ | Justice Battu Devanand to AP High Court | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టుకి జస్టిస్‌ బట్టు దేవానంద్‌

May 28 2025 1:57 AM | Updated on May 28 2025 2:00 AM

Justice Battu Devanand to AP High Court

సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం

సాక్షి, అమరావతి: మద్రా­సు హైకోర్టు న్యాయ­మూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ బ­దిలీపై ఆంధ్ర­ప్రదేశ్‌ హైకో­ర్టు­కు రానున్నారు. జస్టిస్‌ దేవానంద్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నేతృత్వంలో కొలీజియం తీర్మానం చేసింది. ఈ తీర్మానం కేంద్ర న్యాయశాఖకు అక్కడి నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రా­ష్ట్రపతికి చే­రు­తుంది. రాష్ట్రపతి ఆమోద­ముద్ర వేసిన తరు­వాత కేంద్ర న్యాయశాఖ నోటిఫికే­షన్‌ జారీ చే­స్తుంది. 

జస్టిస్‌ బట్టు దే­వానంద్‌ 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయ­మూ­ర్తిగా నియ­మి­తులయ్యారు. 2023 ఏప్రిల్‌లో ఆయన మద్రా­సు హైకోర్టుకి బదిలీ అయ్యారు. ఇప్పుడు ఆయన తిరిగి ఏపీ హై­కోర్టుకు రాను­న్నారు. ఏపీ హైకోర్టులో ఆయ­న నంబర్‌ 4వ స్థానంలో కొనసా­గుతారు. ఏపీ హైకోర్టు న్యా­యమూ­ర్తి­గా, మద్రాసు హైకోర్టు న్యాయమూ­ర్తిగా ఆయ­న పలు కీలక తీర్పులు వెలువరించారు. జస్టిస్‌ బట్టు దేవా­నంద్‌ది కృష్ణా జిల్లా, గుడివాడ. 1966 ఏప్రిల్‌ 14న బట్టు వెంకటర­త్నం, మనో­రంజిత­మ్మ­లకు జన్మించారు.

 కాలే­జీలో చదివే సమయంలో ఆయన విద్యార్థి నా­య­కుడిగా ఉన్నారు. అటు తరువాత హైకోర్టు న్యాయ­వా­దిగా అయ్యారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యు­డిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ న్యాయ­వాది­గా బా­ధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు భార్య పద్మ కుమారి, కుమార్తెలు మౌని, కీర్తి ఉన్నా­రు. 2028 ఏప్రిల్‌ 13 వరకు ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement