
నీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం.. చేతనైతే అడ్డుకో
తాడిపత్రి ఏఎస్పీపై నోరుపారేసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి నోరుపారేసుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) నాగరాజ నాయుడిని అందరూ చూస్తుండగానే నోటికొచ్చినట్లు దూషించిన సంగతి మరచిపోక ముందే.. మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని ఉద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడారు. అనంతపురంలోని ఆయన నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాడిపత్రి ఏఎస్పీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. ‘మాకు ఒక ఏఎస్పీ వచ్చారు. మొదట్లో డీఎస్పీ చైతన్య బాగున్నాడు. తరువాత చెడిపోయినాడు. ఇప్పుడు ఒక ఏఎస్పీ ఉన్నారు. ఈయన మరో చైతన్యలా తయారయ్యారు.
ఈయన వచి్చనప్పటి నుంచే మొదలుపెట్టాడు. పోలీసు బందోబస్తు పెట్టి టవర్ నిరి్మస్తావా? వైఎస్సార్‌సీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నావ్.. ఎంత ముట్టింది నీకు? ఏం తెలుసు నీకు .. ఐదేళ్లు కష్టపడ్డాం రోయ్.. బస్సులు పోయినాయి.. అన్నీ పోయినాయి.. నువ్వు న్యాయం చేస్తావా..రా.. బుధవారం నీ పోలీసోళ్లు.. నువ్వు రా.. మా రైతాంగం ముందు ఉంటుంది. బుధవారం ఏఎస్పీ ఆఫీసు ముందు ధర్నా చేస్తాం. నీ చేతనైతే అడ్డుకో... పోలీస్ పవర్ ఏందో చూపించు. బుధవారం ప్రతి రైతు వస్తాడు. ఎన్ని గన్నులు పెట్టుకుంటావో.. పెట్టుకో’ అంటూ పళ్లు కొరుకుతూ తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని ఘాటుగా హెచ్చరించారు. ‘అడిషనల్ ఎస్పీ మర్యాదగా మాట్లాడతా ఉండా.. ఇంకా.. 73 సంవత్సరాల్లో అన్నీ చూశా. కేసులు పెడతావా? పెట్టు.. 133, 153 కేసులు అంతే కదా.. రేయ్ పొద్దున్నే మీ ఇంటి ముందు కూర్చుంటాను.
నాకు జవాబు చెప్పాలా..నాకు జరిగిన ఐదేళ్ల అన్యాయం నాకు చెప్పాలి. ఏమనుకుంటాండావ్.. మర్యాదగా బతికినా. మర్యాదగా చస్తా.. చూద్దాం..బుధవారం రావాలా..పోలీసులతో అడ్డుకోవాలా.. ఎంత ముట్టింది.. నాకు ఎవరి భయమూ లేదు.. నేనే ఫైట్ చేస్తా.. నో ప్రాబ్లం.. నో పాలిటిక్స్.. రేయ్ ఏఎస్పీ ఏమనుకుంటాండావ్.. నీ మీద కూడా కేసు పెడతా. నీ వల్లనే మొన్న గలాటా అయింది. నువ్వు మా వాళ్లకి ప్రామిస్ చేసినావ్. అయినా 18వ తేదీ ప్రభుత్వం ఒత్తిడి ఉన్నా పోలీసులకు మర్యాద ఇవ్వాలని చెప్పి విత్‌డ్రా అయ్యాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం.. నేను.. ఆయన (మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి) కొట్టుకుంటే ఏమవుతుంది?! ప్రజలు నష్టపోతారు.
అంతేకానీ ఆయన్ను నేను హౌస్ అరెస్ట్ చేయమని చెప్పలేదే! యే..ఏఎస్పీ.. పొద్దున్నుంచి లా అండ్ అర్డర్ అంటాండావ్..మాకు తెలియదా లా అండ్ ఆర్డర్.. నీ ఆఫీసులోనే నేను, నా భార్య, నా కోడలు వచ్చి కూర్చుంటాం. మాకు జరిగిన అన్యాయం వివరిస్తాం. న్యాయం చేయి. అప్పటి డీఎస్పీ చైతన్యే మేలు. నువ్వు ఇప్పటి నుంచే మొదలు పెట్టావ్. పవర్ గ్రిడ్ వాళ్లు దండిగా పంపించారు. 133 కేసులు.. జవాబు చెప్పు. అతి పడతావా నువ్వు.. పో కంప్‌లైట్ చేయి.. నీకు పవర్ ఉంది. అన్ని జీవోలు తీసుకువచ్చి ..ధర్నా చేస్తా. ఫైట్ చేస్తా. రా.. బుధవారం.. చాలా మందిని చూశాం. చాలా మందికి రెస్పెక్ట్ ఇచ్చాం. తాడిపత్రికి రెండో చైతన్య నువ్వు. మళ్లీ ఓపెన్ చేస్తావా.. కేసులు ..చేయి.. ఎంత కొట్టావు.. ఎంత కొట్టినావు.. ఎంత అందింది.. నీకు రేయ్..’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు.
