ఈ నా కొ..లకు లా తెలియదు | JC Prabhakar Reddy inappropriate comments on lawyers | Sakshi
Sakshi News home page

ఈ నా కొ..లకు లా తెలియదు

Jun 28 2026 5:23 AM | Updated on Jun 28 2026 5:23 AM

JC Prabhakar Reddy inappropriate comments on lawyers

ఈ నాయళ్లు 420 నా కొ..లు   

న్యాయవాదులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు

అనంతపురం టౌన్‌: ‘ఈ నా కొ..లకు లా తెలియదు. ఏమీ తెలియదు. 420 నా కొ..లు’ అంటూ న్యాయవాదులపై అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. ఆయన శనివారం అనంతపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘మీకు చదువురాదు.. ఏమీ రాదు. నేనే వచ్చి మీకు ఎక్స్‌ప్లెయిన్‌ చేయాలి. మీకు సిగ్గుందా రా? లీగల్‌ సెల్‌ అంట.. ఏమి తెలుసురా మీకు? మీరు చేసేది భూ కబ్జాలు రా.. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా?’ అంటూ న్యాయవాదులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

‘రేయ్‌ వస్తున్నా.. మీరు డేట్‌ చెప్పండిరా.. డిబేట్‌ పెట్టుకుందాం. ప్రతి ఒక్క నా కొ..కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నా కొ..లే. రేయ్‌ రండి రా.. కోర్టు రోడ్డుకు వస్తా.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుందాం. తాడిపత్రికి వస్తామంటే.. రండి చూద్దాం’ అంటూ నోరుపారేసుకున్నారు. ‘మూడేళ్ల తర్వాత వాళ్లు చూపిస్తారంటా. మనం రేపటి నుంచే చూపిద్దాం. ఇప్పటికే అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లా.. త్వరలోనే లోకేశ్‌ దృష్టికి తీసుకెళతా. ప్రతి టీడీపీ కార్యకర్త సిద్ధంగా ఉండాలి. మనమేంటో చూపిద్దాం’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పెద్దారెడ్డిని పక్కన పెట్టుకొని మాట్లాడే ప్రతి ఒక్కరి కథ తమకు తెలుసని, జాగ్రత్తగా ఉండాలంటూ బెదిరించారు.

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు  
‘గత ప్రభుత్వంలో మీరు పెట్టిన కేసుల వివరాల పుస్తకాలను వెంకట్రామ్‌ (మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి), శైలజానాథ్‌కు పంపాను. ఏ కార్యకర్తకైనా కాఫీ పోశావా? టిఫిన్‌ పెట్టావా వెంకట్రామ్‌? నీ మీదా, రంగయ్య, విశ్వేశ్వరరెడ్డి నెత్తిమీద ఒక్క రూపాయి పెట్టి వేలం వేస్తే దమ్మిడికి కూడా పోరురా మీరు. మళ్లీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? వాడిని (తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని) పక్కన పెట్టుకోకుండా ఏమైనా తిట్టండి. అయినా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement