మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు నిధుల విడుదల

Jawahar Reddy Issues Orders Over New Medical Colleges Funds AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి సంబంధించి పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. ఈ మేరకు.. పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల కాలేజీల్లో ఒక్కొక్క చోట 100 ఎంబీబీఎస్ సీట్లు, మచిలీపట్నంలో 150 ఎంబీబీఎస్ సీట్లు, అమలాపురం, ఏలూరు, పిడుగురాళ్ల, మదనపల్లి, ఆదోని, పులివెందులలో కాలేజీలకు 104.17 కోట్ల రూపాయలతో స్థలాల కొనుగోలుకై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకై ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పరిపాలన అనుమతులు జారీ చేశారు. విశాఖ జిల్లా పాడేరు, వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకై 500 కోట్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైద్య కళాశాల ఏర్పాటుకు రూ. 550 కోట్లు మొత్తంగా 2050 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు జారీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top