సాక్షి,కృష్ణా: జిల్లాలో కూటమి నేతల అసల రంగులు బయటపడుతున్నాయి. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామంలో జనసేన పార్టీ గుర్తుతో ఎంపీటీసీగా కళ్యాణపు నవాబ్ గెలిచాడు. అయితే పంచాయతీ ఎన్నికల్లో తన భార్యను టీడీపీ సర్పంచ్ అభ్యర్ధిగా పోటీకి దించే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో కూరాడ గ్రామ జనసేన కార్యకర్తలు కళ్యాణపు నవాబ్‌ను నిలదీశారు.
జనసేన సింబల్ మీద ఉన్నావా?.. సైకిల్ సింబల్ మీద ఉన్నావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కల్యాణ్ నవాబ్ టీడీపీ పార్టీకే కట్టుబడి ఉన్నానని చెప్పడంతో జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. నిన్ను ఎంపీటీసీగా గెలిపించుకున్నందుకు మమ్మల్ని మేం చెప్పుతో కొట్టుకోవాలి అంటూ ఎంపీటీసీ ముందే చెప్పుతో కొట్టుకున్నారు.
ఎన్నికల ముందు టీడీపీ నుంచి జనసేనలో చేరారు కళ్యాణపు నవాబ్. అతడికి ఎంపీటీసీ టికెట్ ఇవ్వడం కోసం పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి మరీ అతన్ని గెలిపిస్తే ఇప్పుడు టీడీపీ గుర్తుతో గెలిచానని చెప్పడంతో జనసేన కార్యకర్తలు ఇలాంటి వారి వల్లే తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు


