అనంతపురం: రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఉన్మాదం సృష్టించి ఇద్దరు విద్యార్థినులు తీవ్రంగా గాయపడటానికి కారణమైన నిందితుడు హేమంత్ పల్మనరీ ఎంబాలిజం(రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం) సమస్యతో అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
గత కొన్ని రోజులుగా అనంతపురంలో చికిత్స కొనసాగుతున్న సమయంలో ఈరోజు(శుక్రవారం) మంచంపై నుంచి కింద పడిపోయాడు. దాంతో మెరుగైన వైద్యం కోసం అతన్ని కర్నూలుకు తరలించారు.


