ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య | Intermediate Student Ends Life In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Apr 15 2025 4:51 AM | Updated on Apr 15 2025 4:51 AM

Intermediate Student Ends Life In Visakhapatnam

మర్రిపాలెం: ఇంటర్‌ మొ­దటి సంవత్సరంలో ఫెయిల్‌ కావడంతో వి­శా­ఖలో ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహ­త్య చేసుకుంది. విశాఖ జిల్లా రెడ్డి కంచరపాలెంకు చెందిన నిహారిక(17) నగరంలోని ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదివింది. జువాలజీ సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయ్యింది.

దీంతో మనస్తాపం చెందిన నిహారిక సోమ­వారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కుటుంబసభ్యులు గుర్తించి.. కిందకు దించేసరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement