చిన్నారి అసాధారణ ప్రతిభ.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే | Indian Youngest Talented GIRL Veda Evangel | Sakshi
Sakshi News home page

చిన్నారి అసాధారణ ప్రతిభ.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే

Nov 7 2021 12:53 PM | Updated on Nov 7 2021 1:35 PM

Indian Youngest Talented GIRL Veda Evangel - Sakshi

తల్లిదండ్రులతో చిన్నారి వేద ఇవాంజెల్‌  

పట్టుమని రెండున్నరేళ్లు కూడా లేని చిన్నారి అద్భుతమైన జ్ఞాపకశక్తితో వేలాది వస్తువుల పేర్లు, జంతువులు, మానవదేహంలోని భాగాలు.. ఇట్టే గుర్తించి వాటి పేర్లను టుక్కున చెబుతూ దేశంలోని ప్రధాన రికార్డుబుక్కుల్లో ఒకటైన ఓఎంజీ(ఓ మై గాడ్‌ బుక్‌ ఆఫ్‌ ఇండియా)లో ఇండియన్‌ యంగెస్ట్‌ టాలెంటెడ్‌ గర్ల్‌గా రికార్డు సృష్టించింది.

పలమనేరు: పట్టుమని రెండున్నరేళ్లు కూడా లేని చిన్నారి అద్భుతమైన జ్ఞాపకశక్తితో వేలాది వస్తువుల పేర్లు, జంతువులు, మానవదేహంలోని భాగాలు.. ఇట్టే గుర్తించి వాటి పేర్లను టుక్కున చెబుతూ దేశంలోని ప్రధాన రికార్డుబుక్కుల్లో ఒకటైన ఓఎంజీ(ఓ మై గాడ్‌ బుక్‌ ఆఫ్‌ ఇండియా)లో ఇండియన్‌ యంగెస్ట్‌ టాలెంటెడ్‌ గర్ల్‌గా రికార్డు సృష్టించింది. పలమనేరులో నివాసం ఉండే అమరనాథ్, హిమబిందు కుమార్తె వేద ఇవాంజెల్‌ అసాధారణ ప్రతిభ చూసిన వారు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

చదవండి: ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా గుర్రంపైనే.. 

చిన్నారి ప్రతిభను చూసి.. 
9 నెలల వయసు నుంచే చిన్నారి జ్ఞాపకశక్తిని గుర్తించిన తల్లి హిమబిందు తగు శిక్షణ ఇచ్చింది. గతనెల 13న చిన్నారి టాలెంట్‌కు సంబంధించిన వీడియోలతో ఓఎంజీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై వారు లైవ్‌లో పరీక్షించిన జడ్జిలు ఇటీవలే ఇండియన్‌ యంగెస్ట్‌ టాలెంటెడ్‌ గర్ల్‌గా రికార్డులోకి ఎక్కించి వారి అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను ప్రకటించారు.  రెండ్రోజుల క్రితం ముంబై నుంచి వేద ఇవాంజెల్‌కు కొరియర్‌లో ఓఎంజీ రికార్డ్స్‌ చీఫ్‌ ఎడిటర్‌ కమ్‌ సీఈఓ డా.దినేష్‌ కే గుప్త నుంచి మెడల్, షీల్డ్‌ అందాయి.

చదవండి: నాడు ఫిరంగులకు..నేడు పకోడీలకు ప్రసిద్ధి

గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ లక్ష్యం.. 
తమ చిన్నారి టాలెంట్‌ను చూపి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో స్థానం కోసం ప్రయత్నిస్తున్నట్లు తల్లిదండ్రులు అమరనాథ్, హిమబిందు తెలిపారు. అయితే గిన్నీస్‌బుక్‌లోకి ఎక్కాలంటే అంతకుముందు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ తదితరాల్లో రికార్డులలోకి ఎక్కాల్సి ఉంటుదన్నారు. వాటి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాగా బాలిక తండ్రి బెంగళూరు సెయింట్‌జాన్స్‌ ఆస్పత్రి ప్రాజెక్టులో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా, తల్లి గృహిణిగా ఉంటున్నారు. జాతీయస్థాయిలో పలమనేరుకు పేరు తెచ్చిపెట్టిన ఆ చిన్నారిని పట్టణవాసులు అభినందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement