కేసులతో డీఎస్సీ అక్రమాలను కప్పిపుచ్చుతారా? | Illegal cases against leaders who questioned the DSC scam are atrocious says ysrcp | Sakshi
Sakshi News home page

కేసులతో డీఎస్సీ అక్రమాలను కప్పిపుచ్చుతారా?

Sep 26 2026 4:32 AM | Updated on Sep 26 2026 4:32 AM

Illegal cases against leaders who questioned the DSC scam are atrocious says ysrcp

సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు

వైఎస్సార్‌సీపీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు మండిపాటు 

డీఎస్సీ స్కామ్‌ను ప్రశ్నించిన నేతలపై అక్రమ కేసులు దారుణం  

నేడు విజయవాడ సీపీని కలిసి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం 

పోలీసుల తోపులాట వల్లే కాకుమాను రాజశేఖర్‌ మృతి   

సాక్షి, అమరావతి: డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో చోటుచేసుకున్న అక్రమాలపై ఆధారాలతో ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతల గొంతు నొక్కేందుకు వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పోలీసు కేసులను అడ్డుపెట్టుకుంటోందని వైఎస్సార్‌సీపీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వారితో పార్టీ స్టేట్‌ కో– ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమై పార్టీ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులపై చర్చించారు. 

అనంతరం మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మురుగుడు హను­మంతరావు, యేసురత్నం, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్‌ సుధాకర్‌బాబు, స్వామిదాస్, ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ వ్యవహారంపై సమాధానం చెప్పకుండా నిరసనకు వెళ్లిన నేతలు, కార్యకర్తలపై తీవ్ర సెక్షన్లతో కేసులు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. ఆయుధం,గాయం లేకపోయినా, రక్తపు చుక్క కన్పించకపోయినా హత్యాయత్నం కేసు ఎలా నమోదు చేశారని  నిలదీశారు.    

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం 
‘మఫ్టీలో వచ్చి నాయకులను అరెస్టు చేయడం, ఇళ్ల చుట్టూ తిరిగి భార్యాపిల్లలను భయపెట్టడం ప్రజాస్వామ్య పద్ధతి కాదు. కేసులు పెట్టాలనుకుంటే అందరిపై పెట్టండి.. మే­మంతా వస్తాం. అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచండి. చట్ట ప్రకారం బెయిల్‌ తీసుకుంటాం. రాత్రిపూట అరెస్టు­లు, మఫ్టీలో తీసుకెళ్లడంపై కోర్టును ఆశ్రయిస్తాం. డీఎస్సీ అక్రమాలపై మేము శాంతియుతంగా నిరసనకు వచ్చాం. ఐదు రోజుల ముందే పోలీసులకు సమాచారమిచ్చాం. అయినా మాపై కేసులు పెట్టి, ఎఫ్‌ఐఆర్‌లలో ‘వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు’, ‘ఇతరులు’ అంటూ ఎవరినైనా కే­సుల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. 

స్థానిక సంస్థల ఎన్ని­కల్లో మేము బయట ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ కేసులు పెడుతున్నారు. ఈనెల 26న వైఎస్సార్‌సీపీ నేతలందరం విజయవాడ సీపీని కలిసి వినతిపత్రం ఇస్తాం. పోలీసుల తోపులాటలో మా పార్టీ నేత కాకుమాను రాజశేఖర్‌ తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటనకు బాధ్యత వహించాలి. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా మాపైనే ఎస్సీ–ఎస్టీ కేసులతో పాటు, సెక్షన్‌–307 కింద కేసులు పెట్టడం ఏమిటి?  

ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం 
వీడియో ఆధారాలతో పోలీసుల తీరును ప్రశ్నిస్తున్నాం. పార్టీ ఎస్సీ విభాగం నేత వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు పైనా ఎస్సీ, ఎస్టీ కేసు పె­ట్టారు. ఎందరిపై ఎన్ని కేసులు పెట్టినా న్యాయ పరంగా దీటుగా ఎదుర్కొంటాం.  రెడ్‌బుక్‌ తరహా చర్యలతో పార్టీని అణచి వేయాలని చూస్తే ప్రజల తరఫున రెట్టింపు పౌరుషంతో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. శాప్‌ కార్యా­లయం వద్ద టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి నిరసనకు అవకాశమిచ్చా­రు. 

డీఎస్సీ అక్రమాలపై మేము ఆధారాల­తో ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు’ అని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. ఈ సమావేశంలో  వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళి, డై­మండ్‌ బాబు, వరికూటి అశోక్‌బాబు, నూరి ఫాతిమా, వడ్డి రఘురాం, దొంతిరెడ్డి వేమారెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, పార్టీ ప్రధాన కార్యదర్శులు పూడి శ్రీహరి, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పార్టీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, మాజీ మేయర్‌ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement