‘ఏపీలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను’ | Sakshi
Sakshi News home page

‘ఏపీలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను’

Published Fri, Oct 13 2023 12:00 PM

I Feel Lucky To Born In AP: Cricketer Srikar Bharat - Sakshi

సాక్షి, విశాఖ:  ఆంధ్రప్రదేశ్‌లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని క్రికెటర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ పేర్కొన్నారు. తనను తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించడంతో పాటు ఏసీఏ(ఆంధ్రక్రికెట్‌ అసోసియేషన్‌) మంచి సహాయ సహకారాలు అందించిన కారణంగానే దేశం తరఫున ఆడే అవకాశం దక్కిందన్నాడు.

శుక్రవారం విశాఖలో క్రికెటర్‌ భరత్‌ను మంత్రి గుడివాడ్‌ అమర్నాథ్‌, వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డిలు ఘనంగా సన్మానించారు.  ఈ మేరకు మాట్లాడిన శ్రీకర్‌ భరత్‌.. ‘నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒకరికి ధన్యవాదాలు. నా తల్లి దండ్రులు ఎంతగానో నన్ను ప్రోత్సహించారు. ఏసీఏ మంచి సహాయ సహకారాలు అందించింది. నా ఎదుగుదలలో ఏసీఏది కీలక పాత్ర. ఏసీఏ సహాయ సహకారాలు మర్చిపోలేనిది. పట్టుదలతో విజయం సాధించవచ్చు. 

దేశానికి ఆడడం గర్వంగా భావిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. సీఎం జగన్ సార్ ను కలిశాను. సీఎం జగన్ సార్‌ ఎంతగానో ప్రోత్సహించారు. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఆడుదాం ఆంధ్ర అనేది మంచి కార్యక్రమం’ అని భరత్‌ స్పష్టం చేశాడు.

మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ..  ‘దేశానికి గర్వకారణం భరత్. 140 కోట్ల మంది ప్రజల్లో భారత్ క్రికెట్ జట్టుకు భరత్‌ ఎంపిక కావడం సంతోషం. అడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలను సీఎం వైఎస్ జగన్ ప్రోత్సహిస్తున్నారు. వత భరత్, రాయుడును ఆదర్శంగా తీసుకోవాలని సీఎం  చెప్పారు. గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగం, 1000 చదరపు గజాల స్థలం  ఇవ్వడానికి సీఎం జగన్ నిర్ణయించారు. భరత్ అకాడమీ పెడితే సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ధోనీలా భరత్‌కు మంచి భవిష్యత్‌ ఉంది. క్రికెట్ ఆడే యువతకు భరత్ ఆదర్శం’ అని తెలిపారు.

వైవీ సుబ్బారెడ్డి పాయింట్స్ మాట్లాడుతూ.. ‘పట్టుదలతో శ్రీకర్ భరత్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.దేశం గర్వించదగ్గ బిడ్డను మనకు భరత్ తల్లి దండ్రులు అందించారు.పట్టుదలతో వరల్డ్ టెస్ట్ మ్యాచ్ లో స్థానం సంపాదించారు.రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ భరత్‌కు ఉంది. యువకుల్లో క్రీడా స్ఫూర్తి పెంచడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము.ఈ కార్యక్రమం ద్వారా అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తారు. ఏసీఏ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..త్వరలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. అన్ని రకాల క్రీడలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement