సీఎం చంద్రబాబు ఈవెంట్స్‌కు మరో రూ.10.59 కోట్లు | Huge Spent on event management for CM Chandrababu district tours | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబు ఈవెంట్స్‌కు మరో రూ.10.59 కోట్లు

Oct 6 2026 4:59 AM | Updated on Oct 6 2026 4:59 AM

Huge Spent on event management for CM Chandrababu district tours

సీఎం జిల్లాల ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యయం రూ.44.62 కోట్లు

మాన్‌ డెకరేటర్స్‌కు బకాయిలు రూ.11.71 కోట్లు విడుదల

దీంతో ఇప్పటివరకు ఈవెంట్స్‌కు రూ.22.31 కోట్లు విడుదల

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు జి­ల్లాల పర్య­టనల్లో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ పనుల­కు భారీగా ఖర్చు చేస్తున్నారు. జిల్లాల్లో సీఎం కార్య­క్రమాలను మాన్‌ డెకరేటర్స్‌ నిర్వహి­స్తోంది. ఇందుకోసం రూ.­44.62 కోట్లు ఖర్చయిందని, ఇందులో 50 శాతం బకాయిలను చెల్లించా­లని ఆ సంస్థ రాష్ట్ర ప్రభు­త్వా­న్ని కోరింది. దీంతో ఆర్థిక శాఖ రూ.22.31 కోట్ల అదనపు నిధులను విడుదల చేసింది. ఇందులో గత నెలలో అయిన ఖర్చు రూ.11.71 కోట్లు చెల్లించేందుకు పరిపాలన అనుమతి ఇస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది.

మరో రూ.­10.59 కోట్లు చెల్లించేందుకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్య కార్యదర్శి జె.శ్యామల­రావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. దీంతో సీఎం ఈవెంట్లకు ఇప్పటివరకు రూ.22.31 కోట్లు చెల్లించారు. ఈ ఖర్చును ప్రముఖుల ప్రోటోకాల్‌ వ్యయం ఖా­తా కింద విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ చె­ల్లింపులు ‘షెడ్యూల్‌ ఆఫ్‌ రేట్స్‌’ ఖరారు, చర్చలకు లోబడి జరగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

డీడీ­వోలందరూ ఆర్థిక శాఖ సూచ­నల ప్రకారం అడ్వా­న్సులు ఇచ్చి ఉంటే వాటిని ధృవీకరించుకుని, మాన్‌ డెకరేటర్లకు మంజూరైన బడ్జె­ట్‌ను రూపొందించి, పంపిణీకి అనుమతించాలని పేర్కొన్నారు. పొరపాటున అదనంగా విడుదల చేసిన మొత్తాలంటే, వాటిని ఎటువంటి నోటీసు లేకుండా ఏజెన్సీకి చెల్లించవలసిన మిగిలిన మొత్తాల నుంచి వసూలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement