హెచ్‌ఎస్‌ఎల్, విశాఖపట్నంలో 53 ఖాళీలు

HSL Vizag Recruitment 2021: Vacancies, Eligibility, Selection Process - Sakshi

విశాఖపట్నంలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎస్‌ఎల్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 53
పోస్టుల వివరాలు: పర్మనెంట్‌ ప్రాతిపదికన–18, ఒప్పంద ప్రాతిపదికన–31, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన–04.

పర్మనెంట్‌ ప్రాతిపదికన: పోస్టులు: జనరల్‌ మేనేజర్, అడిషనల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్, మేనేజర్‌. –విభాగాలు: హెచ్‌ఆర్, టెక్నికల్, ఫైనాన్స్‌. అర్హత: ఫుల్‌టైం గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఒప్పంద ప్రాతిపదికన: పోస్టులు: డిప్యూటీ చీఫ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్, ప్రాజెక్ట్‌ మేనేజర్, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌. –విభాగాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆగుమెంటేషన్, ఎస్‌ఏపీ, ఏబీఏపీ డెవలపర్, సబ్‌మెరైన్‌ టెక్నికల్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం ఇంజనీరింగ్‌ డిప్లొమా/ఇంజనీరింగ్‌ డిగ్రీ(బీఈ/బీటెక్‌)/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన: పోస్టులు: సీనియర్‌ కన్సల్టెంట్, కన్సల్టెంట్‌.
 విభాగాలు: టెక్నికల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆగుమెంటేషన్, ఈకేఎం ప్లానింగ్‌ అండ్‌ సబ్‌మెరైన్‌ మేనేజ్‌మెంట్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్‌/ఇంటర్వ్యూ(ఆన్‌లైన్‌) ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.08.2021
► వెబ్‌సైట్‌: www.hslvizag.in

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top