మళ్లీ బుడమేరు టెన్షన్‌.. సూర్యాపేట అతలాకుతలం | Heavy Rainfall In Telugu States Andhra Pradesh And Telangana Live Updates And Viral Videos | Sakshi
Sakshi News home page

Heavy Rainfall Updates: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

Aug 14 2025 9:15 AM | Updated on Aug 14 2025 11:21 AM

Heavy Rain Fall In AP And Telangana Live Updates

Heavy Rain Updates..

👉తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. ఏపీలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో నేడు విద్యాసంస్థలు బంద్‌. 

చెట్టు కూలి డెక్కన్‌ పరిశ్రమ ఉద్యోగి మృతి

  • అనకాపల్లిలో భారీ వర్షాలకు చెట్టు కూలి డెక్కన్‌ పరిశ్రమ ఉద్యోగి మృతి
  • పాయకరావుపేట మండలం పెదరామభద్రాపురం వద్ద ఘటన
  • మృతిచెందిన ఉద్యోగి రాజమండ్రి వాసిగా పోలీసులు గుర్తింపు


మహబూబ్‌నగర్‌లో వర్ష బీభత్సం..

  • మహబూబ్‌నగర్‌లో నీట మునిగిన పాలిటెక్నిక్ కళాశాల వెళ్లే ఆర్‌యూబీ
  • ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌ జిల్లాలో భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇరువైపుల కూలిన సైడ్ వాల్
  • అడ్డాకుల మండలంలో తిమ్మక్కవాగు ఉద్ధృతికి నిలిచిన రాకపోకలు
  • బలిదుపల్లి- కన్మనూరు గ్రామాల మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు
  • మద్దూరు మండలంలో పలు రహదారులపై భారీగా నిలిచిన నీరు
  • బూనేడు- కొత్తపల్లి, నిడ్జింత-మద్దూర్ మధ్య నిలిచిన రాకపోకలు
  • మిడ్జిల్ మండలంలో దుందుభి వాగు ఉద్ధృతికి పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం
  • వనపర్తి జిల్లాలో వాగుల ఉద్ధృతికి గోపాల్‌పేట- చెన్నూరు మధ్య నిలిచిన రాకపోకలు
  • పాన్‌గల్ మండలంలో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • రాయనిపల్లి- బి.సి.రెడ్డిపల్లి, రేమద్దుల- కొల్లాపూర్ మధ్య నిలిచిన రాకపోకలు
  • సరళాసాగర్ అటోమేటిక్‌ సైఫన్‌ల నుంచి నీరు విడుదల
  • మదనాపురం- ఆత్మకూరు మధ్య లోలెవెల్ వంతెన పైనుంచి వరద ప్రవాహం

 నల్గొండ..

  • మిర్యాలగూడ-సూర్యాపేట మధ్య నిలిచిపోయిన రాకపోకలు
  • వేములపల్లి మం. లక్ష్మీదేవిగూడెం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు
  • బీమారం రహదారిపై వాగు ఉద్ధృతికి నిలిచిన వాహనాల రాకపోకలు
  • మిర్యాలగూడ- సూర్యాపేట మధ్య నిలిచిపోయిన రాకపోకలు


హిమాయత్‌సాగర్‌కు పోటెత్తున్న వరద

  • హిమాయత్‌సాగర్‌ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల
  • పూర్తి నీటినిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు
  • ప్రస్తుతం నీటినిల్వ 2.64 టీఎంసీలు
  • జలాశయం ఇన్‌ఫ్లో 17,000 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్‌ జలాశయం ఔట్‌ఫ్లో 7,926 క్యూసెక్కులు

 

సూర్యాపేటలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు

  • సూర్యాపేటలోని నడిగూడెంలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు.
  • చౌదరి చెరువు మత్తడి దూకడంతో నీట మునిగిన పలు కాలనీలు
  • ఇళ్లల్లో చేరిన నీటిని ఎత్తిపోస్తున్న కాలనీవాసులు

ఓఆర్‌ఆర్‌ సర్వీస్ రహదారి మూసివేత

  • రాజేంద్రనగర్ వద్ద ఓఆర్‌ఆర్‌ సర్వీస్ రహదారి మూసివేత
  • హిమాయత్‌సాగర్ నీరు విడుదలతో రోడ్డు పైనుంచి ప్రవాహం
  • బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్న పోలీసులు
  • వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన పోలీసులు

మళ్లీ బుడమేరు టెన్షన్‌..

  • రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న బుడమేరు.
  • విజయవాడ నగరవాసులకు మళ్లీ బుడమేరు వరద టెన్షన్‌
  • గతేడాది ఇదే సమయంలో విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద.
  • అధికారులు తక్షణమే స్పందించాలంటున్న స్థానికులు. 

ఎన్టీఆర్ జిల్లా..

  • నీట ముగిసిన కంచికచర్ల బస్టాండ్
  • చెరువును తలపిస్తున్న బస్టాండ్
  • బస్టాండ్‌లోకి చేరుకున్న భారీ వరద నీరు
  • కంచికచర్ల పట్టణంలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు లోతట్టు ప్రాంతాలు జలమయం.
  • జగ్గయ్యపేటలో భారీ వర్షాలకు సత్యనారాయణపురం, బలుసుపాడు రోడ్డులో పోటెత్తిన వరద నీరు.
  • పెద్ద చెరువుకు గండి కొట్టటంతో ఆర్టీసీ కాలనీలో తగ్గిన వరద నీటి ప్రవాహం.
  • ఇబ్రహీంపట్నం ఫెర్రీ కృష్ణానది పరివాహక ప్రాంతం, కొండపల్లి శాంతినగర్ బుడమేరు పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించిన కలెక్టర్
  • తిరువూరు మండలం చౌటపల్లి -జి.కొత్తూరు గ్రామాల మధ్య ఉన్న వెదుళ్ళవాగుకు పోటెత్తిన వరద.
  • చుట్టుపక్కల పది గ్రామాలకు పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు.
  • పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు వద్ద పొంగిపొర్లుతున్న కూచివాగు.
  • నిలిచిపోయిన రాకపోకలు.
  • వత్సవాయి మండలం కంభంపాడు, మాచినేనిపాలెంలో  భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు.

 

కృష్ణాజిల్లా ..

  • ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణనది వరద నీరు సముద్రంలోకి వదలడంతో దివిసీమకు తాకిన వరద ప్రవాహం
  • అవనిగడ్డ మండలం పాతఎడ్లంక వద్ద కృష్ణానది వరద నీరు రావడంతో
  • అవనిగడ్డ, పాతఎడ్లలంక, గ్రామాల మధ్య రాకపోకలు అంతరాయం
  • పాత ఎడ్లంక గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీరు తెగిపోయిన నదీపాయలో ఏర్పాటు చేసిన కాజ్ వే
  • నాటు పడవ ద్వారా నదీపాయను దాటుతున్న గ్రామస్తులు, రైతులు
  • నదీపాయను దాటేందుకు నాటు పడవను ఏర్పాటు చేసిన అధికారులు

 

ప్రకాశం బ్యారేజీ వద్ద హైఅలర్ట్‌..

  • ప్రకాశం బ్యారేజీ దిగువన లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు
  • ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ప్రవాహం
  • ప్రకాశం బ్యారేజీకి 4,87,508 క్యూసెక్కుల వరద
  • బ్యారేజీ 70 గేట్లు తెరిచి మొత్తం నీరు దిగువకు విడుదల
  • ప్రకాశం బ్యారేజీ ప్రస్తుత నీటిమట్టం 13.6 అడుగులు
  • బ్యారేజీ వద్ద కొనసాగుతున్న ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక
  • బ్యారేజీ దిగువన లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు
  • కృష్ణా నదిలో ప్రయాణం, ఈత నిషేధించిన అధికారులు

హైదరాబాద్‌లో వర్షం

  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
  • జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలో వర్షం
  • బోరబండ, ఎస్‌ఆర్‌ నగర్‌, సనత్‌నగర్ ప్రాంతాల్లో వర్షం

సూర్యాపేట

  • కోదాడ నియోజకవర్గంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు
  • కోదాడలోని పలు కాలనీల్లో నిలిచిన వరద నీరు
  • కాలనీల్లో వరద రావడంతో స్థానికులను సురక్షిత ప్రాంతానికి తరలింపు
  • కోదాడ పెద్దచెరువు మత్తడి పోయడంతో ప్రధాన రహదారిపై నిలిచిన రాకపోకలు
  • మోతె మండలం ఉర్లుగొండ వద్ద పొంగిపొర్లుతున్న పాలేరు వాగు
  • కోదాడ మం. కూచిపూడి, తొగర్రాయి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న అంతర గంగా వాగు
  • నడిగూడెం మండలం రత్నవరం వాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయం
  • అనంతగిరి మండలం గోండ్రియాల-తమ్మర మధ్య రహదారి పై నుంచి వరద నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం
  • నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీళ్లు బంద్ కావడంతో ఊపిరి పీల్చుకుంటున్న కోదాడ నియోజకవర్గ ప్రజలు
  • పెరిగిన గోదావరి నీటిమట్టం..
  • భద్రాచలం వద్ద స్వల్పంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం వద్ద ఉదయం ఏడు గంటలకు గోదావరి నీటిమట్టం 19.3 అడుగులు

కొల్లూరు మండలంలో అప్రమత్తత

  • కృష్ణా ఉద్ధృతితో కొల్లూరు మండలంలో అప్రమత్తత
  • బాపట్ల జిల్లాలో కృష్ణా ఉద్ధృతితో కొల్లూరు మండలంలో అప్రమత్తత
  • దోనెపూడి వద్ద చప్టా పైకి వరదనీరు, 4 లంక గ్రామాలకు తెగిన రాకపోకలు
  • కొల్లూరు వద్ద నక్కపాయకు గండిపడిన చోట నుంచి వరద ప్రవాహం
  • నక్కపాయకు గతేడాది గండిపడిన ప్రాంతం నుంచి వరద ప్రవాహం
  • వరద పెరిగితే లంక గ్రామాలకు రాకపోకలు నిలిచే అవకాశం

Hyderabad Rains : Heavy Rain Lashes Hyderabad9

నేడు తెలంగాణలో అతి భారీ వర్షాలు

  • నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం
  • మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ
  • నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం
  • భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం
  • మహబూబాద్, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం
  • నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ
  • భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ
  • భద్రాద్రి, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ
  • మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్‌ జామ్‌..

  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం
  • దివిటిపల్లి వద్ద వాగు ఉద్ధృతికి కోతకు గురైన ఐటీ పార్కుకు వెళ్లే రహదారి
  • కోతకు గురై గుంతలో పడిన ఓ కంపెనీకి చెందిన బస్సు, తప్పిన ప్రమాదం
  • బెంగళూరు-హైదరాబాద్ శేరిపల్లి సమీపంలో గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై నుంచి పారుతున్న నీళ్లు, నెమ్మదిస్తూ వెళ్తున్న వాహనాలు.
  • జాతీయ రహదారిపై ఇరువైపుల 4 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.

👉తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆ జిల్లాలకు రెడ్​ అలర్ట్ జారీ చేసింది. వర్షాల దృష్ట్యా హైదరాబాద్‌లో హెడ్రా, ట్రాఫిక్​, జీహెచ్​ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు.. ఏపీలోని పలు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల దృష్ట్యా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement