Guntur: రోడ్డుపై అమ్మాయిల హల్‌చల్.. వీడియో వైరల్

సాక్షి, గుంటూరు: జిల్లాలో గుజరాత్ అమ్మాయిలు హల్‌చల్ చేశారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలను ఆపి అమ్మాయిల ముఠా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా బలవంతపు వసూళ్లపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 19 మందిని అదుపులోకి తీసుకున్నారు.