కార్యనిర్వాహక రాజధానిని అడ్డుకోవద్దు | Gudivada Amarnath Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

కార్యనిర్వాహక రాజధానిని అడ్డుకోవద్దు

Jul 25 2020 5:19 AM | Updated on Jul 25 2020 8:17 AM

Gudivada Amarnath Comments On Pawan Kalyan - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖను కార్యనిర్వాహక రాజధాని కాకుండా చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్‌ పవన్‌కల్యాణ్‌లు అడ్డుకోకూడదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ కోరారు. దశాబ్దాల కాలంగా వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న తమ ప్రాంత ప్రజల ఆశలను అడియాశ చేయొద్దన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక కుట్ర చేస్తూ.. నిరంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

► పవన్‌ కు విశాఖ ఏం చేసిందో.. ఎలా ఆదరించిందో.. ఎలా అవకాశాలు కల్పించిందో కొత్తగా చెప్పాల్సిన అవ సరం లేదు. సామాన్యుడిని అడిగినా చెబుతా రు. అలాం టి విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌పై విష ప్రచారం చేస్తున్న పవన్‌ను చూస్తుంటే.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉంది.  
► దయచేసి అభివృద్ధిని ఆపొద్దు.. చేతులెత్తి జోడించి కోరుతున్నా.. చంద్రబాబు మాయలో పడొద్దు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ పవన్‌కల్యాణ్‌ చదవడం.. ఆయన సొంత పీఏ హరిప్రసాద్‌ ప్రశ్నలడగడం.. దానికి ఈయన సమాధానాలు చెప్పడం.. మీ వైఖరి మారదా? ఎన్నికల్లో రెండు చోట్ల ప్రజలు ఛీకొట్టినా ఇంకా బుద్ధి రాలేదా?  
► విశాఖపట్నం అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఉత్తరాంధ్ర ప్రజలంతా తగిన బుద్ధి చెబుతారు.  
► అమరావతిలో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దెబ్బతింటుందని నీకు ప్యాకేజి ఇచ్చి, ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడితే ప్రజల్లో కనీస గౌరవం కూడా కోల్పోతావు. 
► ఇటీవల సినిమా డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ సినిమా తీస్తే.. అదీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనే అని విష ప్రచారం చేస్తున్నావు.. సినిమా రంగంలో ఎలా ఉంటున్నావో అర్థం కాని పరిస్థితి. మీ సినిమాలతో మాకు గానీ, మా పార్టీకి గానీ ఎటువంటి సంబంధం లేదు.   
► చంద్రబాబు తోక పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆయన పార్ట్‌నర్‌ పవన్‌లు స్పందిస్తున్న తీరు చూస్తుంటే రాజధానిని అడ్డుకోవడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement