
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న జీఎస్‌డబ్ల్యూఎస్ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ (జీఎస్‌డబ్ల్యూఎస్) వ్యవస్థ ద్వారా సమర్థమైన సేవలను ప్రారంభించి సోమవారానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జీఎస్‌డబ్ల్యూఎస్ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం స్వాతంత్ర భారతావనిలో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన సంక్షేమరాజ్య నిర్మాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చి.. 1.30 లక్షలకుపైగా యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించారని కొనియాడారు. పేదలకు సంక్షేమ ఫలాలను పారదర్శకంగా అందించడంలో తమను భాగస్వాముల్ని చేయడంపై జీఎస్‌డబ్ల్యూఎస్ రాష్ట్ర నాయకులు బత్తుల అంకమ్మరావు, నిఖిల్‌కృష్ణ, కిషోర్
సంతోషం వ్యక్తం చేశారు.