సీఎం జగన్‌ను కలిసిన సీఎంసీ ప్రతినిధుల బృందం | Group Of CMC Representatives Meets CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన సీఎంసీ ప్రతినిధుల బృందం

Jun 8 2023 7:15 PM | Updated on Jun 8 2023 7:48 PM

Group Of CMC Representatives Meets CM YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌(సీఎంసీ), వేలూరు, చిత్యూరు క్యాంపస్‌ ప్రతినిధుల బృందం గురువారం కలిసింది. సీఎంసీ వేలూరు ఆసుపత్రికి అనుబంధంగా చిత్తూరు క్యాంపస్‌ ఉంది. దీని అభివృద్ధికి సంబంధించి సీఎం జగన్‌తో చర్చించింది సదరు బృందం. చిత్తూరు క్యాంపస్‌లో మెడికల్‌ సెంటర్‌తో కూడిన మెడికల్‌ కాలేజ్‌, హాస్పిటల్‌, నర్సింగ్‌ కాలేజ్‌, ఆరోగ్య సేవలకు అనుబంధంగా ఉండే కోర్సులతో కూడిన కాలేజ్‌ల ఏర్పాటుకు అవసరమైన సహకారం అందించాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. 

ఈ అంశంపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు. సీఎంసీకి ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహకారం ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. సీఎంసీ ద్వారా అత్యుత్తమ వైద్య సేవలు ఏపీ ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమని, ఏపీ ఆరోగ్యం రంగంలో ఇదొక గొప్ప విజయంగా భావిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. 

ఇప్పటికే చిత్తూరులో సెకండరీ కేర్‌ ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు, దానిని అతి త్వరలో 300 పడకల ఆసుపత్రిగా విస్తరించనున్నట్లు సీఎం జగన్‌కు సీఎంసీ బృందం వివరించింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, సీఎంసీ డైరెక్టర్‌ డా.విక్రమ్‌ మాథ్యూస్, మాజీ డైరెక్టర్‌ డా.సురంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement