విశాఖలో 25 ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం

Govt Plans To Construct 25 Acres International Stadium Visakhapatnam - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: రానున్న నాలుగైదు నెలల్లోనే విశాఖలో 25 ఎకరాల్లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారని వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అన్ని క్రీడలు ఒకే చోట నిర్వహించుకునేందుకు అనువుగా ఇంటిగ్రేటేడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు విశాఖలో తగిన స్థలం కోసం అన్వేషణ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 16 నుంచి ఏపీఎల్‌ (ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌) జరగనున్న నేపథ్యంలో ఏసీఏ ఆధ్వర్యంలో విశాఖ బీచ్‌రోడ్‌లో ఆది­వారం 3కే రన్‌ నిర్వహించారు. కాళీమాత ఆల­యం చెంత ఈ పరుగును సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ‘మన ఏపీఎల్‌ మన ఆంధ్రా’ పేరిట ఏపీఎల్‌ రెండో సీజన్‌ బ్రాండింగ్‌లో భాగంగా సీఎం ఆదేశాల మేరకు 3కే రన్‌ నిర్వహించినట్లు చెప్పారు. ఏపీఎల్‌లో ప్రతిభ చూపిన క్రికెటర్లు ఐపీఎల్‌కు ఆడే అవకాశం ఉందన్నారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ , ఏసీఏ అధ్యక్షుడు శరత్‌ చంద్రారెడ్డి, మేయర్, కలెక్టర్‌ పాల్గొన్నారు.

చదవండి   టీటీడీ కీలక నిర్ణయం.. నడక మార్గంలో చిన్నారులకు 2 గంటల వరకే అనుమతి..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top