‘ఏ’ గ్రేడ్‌లో ప్రభుత్వ కళాశాలలు  | Government Colleges in A Grade | Sakshi
Sakshi News home page

‘ఏ’ గ్రేడ్‌లో ప్రభుత్వ కళాశాలలు 

Jan 20 2024 4:46 AM | Updated on Jan 20 2024 4:46 AM

Government Colleges in A Grade - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడానికి ప్రభు­త్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నత విద్యా రంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ప్రై­వే­టు కళాశాలకు దీటుగా ప్రవేశాలు కలి్పస్తూ  ‘ఫ్యూ­చర్‌ రెడీనెస్‌’ కాన్సెప్‌్టతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. ‘నేషనల్‌ అసెస్‌మెంట్, అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌’ (న్యాక్‌) గుర్తింపు సాధనలో ముందంజలో నిలుస్తున్నాయి. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాక ముందు వరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలంటే అందరికీ చిన్న చూపే. పాతికేళ్ల క్రితం ఒక వెలుగు వెలిగిన కాలేజీలు కూడా ఆ తర్వాత ప్రాభవం కోల్పోయి దైన్య స్థితికి చేరా­యి. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంలో వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. పాతబడిపోయిన భవనాలు, సరైన సౌకర్యాలు లేని తరగతి గదులు, పనికిరాని లే»ొరేటరీలు, బోధన సిబ్బంది లేమి వంటి సమస్యలతో వీటిలో చేరాలంటేనే భయపడే పరిస్థితి. న్యాక్‌ అక్రిడిటేషన్‌ సాధించే కాలేజీల సంఖ్య నామమాత్రమే. 

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నత విద్యారంగంలో ముఖ్యంగా ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలను రూపుదిద్దారు. దీంతో ప్రభుత్వ కాలేజీలు మళ్లీ నూతనంగా కనిపిస్తున్నాయి. ఉన్నత విలువలను సంతరించుకొని, విద్యా బోధనలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దీంతో న్యాక్‌ అక్రిడిటేషన్‌ పొంది, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న కాలేజీల సంఖ్య ఏటేటా పెరుగుతోంది.

2019 నాటికి కేవలం 18 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మాత్రమే న్యాక్‌ సర్టిఫికెట్‌ ఉంటే.. ప్రస్తుతం వాటి సంఖ్య 61కి చేరడం ‘ప్రభుత్వ చదువుల అభివృద్ధికి’ నిదర్శనం. రాజ­మండ్రి (అటానమస్‌), నగరి, విశాఖపట్నం (మహిళా), రేపల్లె, ఒంగోలు (మహిళా) ప్రభుత్వ కళాశాలలకు, ఎయిడెడ్‌లో ఏలూరులోని మహిళా సెయింట్‌ థెరిస్సా కళాశాల, నర్సాపురం వైఎన్‌ డిగ్రీ కళాశాలకు ఏకంగా ఏ–ప్లస్‌ గ్రేడ్‌ లభించింది. 

గిరిజన ప్రాంతాల్లో ప్రవేశాలు భేష్‌.. 
ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ డిగ్రీ విద్యలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. 168 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉంటే ఇందులో 2020 తర్వాత 15 కొత్త కళాశాలలు వచ్చాయి. ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా 55 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉన్నత విద్య సంపూర్ణంగా అందుబాటులోకి వచ్చింది.

ఫలితంగా అరకు డిగ్రీ కళాశాలలో 100 శాతం, పాడేరులో 99.70 శాతం, చింతపల్లిలో 97 శాతం, గుమ్మలక్ష్మీపురంలో 92 శాతం ప్రవేశాలు నమోదవడం విశేషం. వీటితో పాటు రాజమండ్రి, గుంటూరు, నెల్లూరులోని ప్రభుత్వ అటానమస్‌ కళాశాలలకు యూజీసీ ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ‘కాలేజీ విత్‌ పొటెన్షియల్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ (సీపీఈ)’ గుర్తింపు సైతం లభించింది. అనంతపురం, కడప అటానమ­స్‌ కళాశాలలు ‘డీబీటీ’ స్టార్‌గా ఎంపికయ్యాయి. 

ఏప్రిల్‌ నాటికి ‘సెంచరీ’ 
న్యాక్‌ గుర్తింపునకు దరఖాస్తు చేసుకోవాలంటే యూ జీసీ (2ఎఫ్‌/12బీ స్టేటస్‌) గుర్తింపు తప్పనిసరి. రాష్ట్రంలో కేవలం 57 కళాశాలలకు మాత్రమే యూ­జీసీ స్టేటస్‌ లేదు. వీటిల్లో కొత్తగా పెట్టిన కాలేజీలకు సొంత భవనాలు నిర్మిస్తున్నారు. ఎయిడెడ్‌ నుంచి ప్రభు­త్వంలోకి వచ్చినవి, అరకొర సిబ్బంది కొరత, అడ్మిషన్లు.. ఇలా చిన్న సాంకేతిక లో­పాలు, కారణా­లతో యూజీసీ స్టేటస్‌కు దూరంగా ఉన్నాయి. ఈ కళాశాలలను అభివృద్ధి చేస్తూనే మిగిలిన 109 కళాశాలల్లో ఏప్రిల్‌ నాటికి వంద కళాశాలలకు న్యాక్‌ గుర్తింపు తీసుకొచ్చేలా ‘కళాశాల విద్య’ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

‘ఇప్పటికే 61 కళాశాలలకు న్యాక్‌ గ్రేడ్‌ సాధించాం. మరో రెండు కళాశాలలకు రిజల్ట్‌ పెండింగ్‌లో ఉంది. ఇంకా 13 కళాశాలలు న్యాక్‌ బృందం పరిశీలన కోసం ఎదురు చూ­స్తు­న్నాయి. 14 కళాశాలలు న్యాక్‌ గుర్తింపు కో­సం సమగ్ర సమాచార నివేదికను రూపొందించాయి. 17 కళాశాలలు సమాచారాన్ని తయారు చేస్తు­న్నాయి. ప్రతి కళాశాలను మా అకడమిక్‌ ఆఫీసర్లతో కూడిన టీమ్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

డేటాను స­్వయంగా విశ్లేషిస్తూ న్యాక్‌ బృందం అభ్యం­తరం చెప్ప­కుండా జాగ్రత్తపడుతోంది’ అంటూ ఓఎస్‌డీ డాక్టర్‌ కె.విజయ్‌ బాబు చెప్పారు. వీటితో పాటు 56 ప్రైవేటు ఎయిడెడ్‌ కళాశాలల్లో 18 కళాశాలలకు న్యాక్‌ గుర్తింపు ఉండగా.. త్వరలోనే మిగిలిన వాటికీ తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement