వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది  | Gopalakrishna Dwivedi As Principal Secretary of AP Agriculture Department | Sakshi
Sakshi News home page

వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది 

Jan 24 2023 4:23 AM | Updated on Jan 24 2023 3:42 PM

Gopalakrishna Dwivedi As Principal Secretary of AP Agriculture Department - Sakshi

మత్స్యశాఖల ముఖ్య కార్యదర్శి బాధ్యతలతోపాటు రైతుభరోసా కేంద్రాల ప్రత్యేక కమిషనర్‌ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. వీటితోపాటు మైనింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శిగాను ఆయన కొనసాగనున్నారు.

సాక్షి, అమరావతి: వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గోపాలకృష్ణ ద్వివేది నియమితులయ్యారు. వ్యవసాయంతో పాటు సహకార, పశుసంవర్ధకం, డెయిరీ డెవలప్‌మెంట్, మత్స్యశాఖల ముఖ్య కార్యదర్శి బాధ్యతలతో పాటు రైతుభరోసా కేంద్రాల ప్రత్యేక కమిషనర్‌ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. వీటితోపాటు మైనింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శిగాను ఆయన కొనసాగనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు వ్యవసాయ అనుబంధశాఖల ముఖ్య కార్యదర్శిగా ఉన్న వై.మధుసూదన్‌రెడ్డిని రిలీవ్‌ చేశారు. మరోవైపు ద్వివేది స్థానంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా.. సెలవుపై వెళ్లి తిరిగి వచ్చిన బుడితి రాజశేఖర్‌ను నియమించారు.    

Advertisement
 
Advertisement
Advertisement