ఎమ్మెల్సీకి టోకరా వేయబోయాడు | Fraud Phone Call To MLC Zakia Khanam In YSR Kadapa | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీకి టోకరా వేయబోయాడు

Sep 9 2020 9:01 AM | Updated on Sep 9 2020 9:01 AM

Fraud Phone Call To MLC Zakia Khanam In YSR Kadapa - Sakshi

ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌

సాక్షి, రాయచోటి: ఓ మోసగాడు ఎమ్మెల్సీకే టోకరా వేయబోయాడు. మంగళవారం రాయచోటిలో ఉన్న ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌కి ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. తన పేరు బాబు జగ్జీవన్‌రావ్‌ అని, సీఎం ఆఫీసులో ప్రాజెక్టు డైరెక్టరుగా పని చేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. రూ.50 వేలు డిపాజిట్‌ చేస్తే మీకు ప్రభుత్వం రూ.25 లక్షల రుణమిస్తుందని చెప్పాడు. డబ్బును జమ చేసేందుకని తెలంగాణలోని జగ్గారెడ్డి గూడెం బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ను పంపించాడు. దీన్ని ఆమె వెంటనే ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి సీఎం కార్యాలయంలో దీనిపై ఆరా తీశారు. అక్కడ అలాంటి వారెవరూ లేరనే విషయం తెలుసుకున్న శ్రీకాంత్‌రెడ్డి.. దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాయచోటి అర్బన్‌ సీఐని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement