‘కూటమి’ కనుసైగల్లోనే ఈ కేసును నమోదు చేశారు: విడదల రజిని | Former Minister Rajini Condemns Arrest of Ex MLA Bollala Brahmanayudu | Sakshi
Sakshi News home page

‘కూటమి’ కనుసైగల్లోనే ఈ కేసును నమోదు చేశారు: విడదల రజిని

Jun 7 2026 5:25 PM | Updated on Jun 7 2026 6:12 PM

Former Minister Rajini Condemns Arrest of Ex MLA Bollala Brahmanayudu

పల్నాడు జిల్లా: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్‌ను మాజీ మంత్రి విడదల రజిని తీవ్రంగా ఖండించారు. ఏపీలోని కూటమి సర్కారు తీరుపై ఆమె మండిపడ్డారు. బాధితుడు బొల్లా బ్రహ్మనాయుడిపై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని, కూటమి ప్రభుత్వం కనుసైగల్లోనే ఈ కేసును నమోదు చేశారని చెప్పారు. 

బ్రహ్మ నాయుడు చేసిన మంచి సేవా కార్యక్రమాలు వినుకొండ ప్రజలకే కాకుండా, రాష్ట్ర ప్రజలకూ తెలుసని  విడదల రజిని తెలిపారు. అటువంటి వ్యక్తిపై కేసు నమోదు చేసి, జైలుకు పంపడం అత్యంత బాధాకరమని చెప్పారు. తమకు న్యాయ వ్యవస్థ పై పూర్తి నమ్మకం ఉందని, బొల్లా బ్రహ్మనాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement