భారత్‌కు పోటెత్తిన పర్యాటకులు | Foreign tourists flock to India | Sakshi
Sakshi News home page

భారత్‌కు పోటెత్తిన పర్యాటకులు

Apr 24 2025 4:43 AM | Updated on Apr 24 2025 4:43 AM

Foreign tourists flock to India

2023–24లో 95.21 లక్షల మంది విదేశీ పర్యాటకుల రాక  

కేవలం 10 దేశాల నుంచే 67.25 లక్షల మంది పర్యాటకులు 

2022–23తో పోలిస్తే 30.83 లక్షల మంది పెరుగుదల 

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడి

సాక్షి, అమరావతి: భారతదేశానికి విదేశీ పర్యాటకులు పోటెత్తుతున్నారు. 2023–24లో 95,20,928 మంది విదేశీ పర్యాటకులు భారత్‌ వచ్చినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో కేవలం 10 దేశాల నుంచే 67.25 లక్షల మంది మన దేశంలో పర్యటించినట్టు పేర్కొంది. వీరిలో అత్యధికంగా బంగ్లాదేశ్‌ నుంచి, ఆ తరువాత స్థానంలో అమెరికా నుంచి పర్యాటకులు వచ్చినట్లు తెలిపింది. 2022–23 సంవత్సరంతో పోలిస్తే.. 2023–24లో 30.83 లక్షల మంది విదేశీయులు అధికంగా వచ్చినట్లు వివరించింది.

వహ్‌.. తాజ్‌! 
2023–24లో స్వదేశీ పర్యాటకులతోపాటు విదేశీ పర్యాటకుల్లో అత్యధికులు తాజ్‌మహల్‌ను సందర్శించినట్టు పర్యాటక శాఖ గణాంకాలు వెల్లడించాయి. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో కుతుబ్‌ మినార్‌ రెండో స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది ఆగ్రా పోర్ట్‌  ఈ స్థానాన్ని దక్కించుకుంది. స్వదేశీ పర్యాటకుల రాకలో కోణార్క్‌లోని సూర్య దేవాలయం రెండో స్థానంలో నిలిచింది.   

Advertisement
 
Advertisement
Advertisement