మా బాధలు మీకేం తెలుసు?.. మంత్రి కందుల దుర్గేష్‌ను నిలదీసిన రైతులు | Farmers Slams On Minister Kandula Durgesh | Sakshi
Sakshi News home page

మా బాధలు మీకేం తెలుసు?.. మంత్రి కందుల దుర్గేష్‌ను నిలదీసిన రైతులు

Jun 3 2025 9:27 AM | Updated on Jun 3 2025 10:24 AM

Farmers Slams On Minister Kandula Durgesh

సాక్షి,తూర్పుగోదావరి జిల్లా:  మంత్రి కందుల దుర్గేష్‌కు నిరసన సెగ తగిలింది. ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలరోజులైనా ధాన్యం డబ్బులు జమ కావట్లేదనీ ప్రశ్నించారు. గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదని.. ధాన్యానికి ఈ దుస్థితి ఎప్పుడూ లేదని ఉండ్రాజవరం రైతులు నిలదీశారు.

ధాన్యం సొమ్ము ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించిన అన్నదాతలు.. మిల్లర్లు 1,600మాత్రమే చెల్లిస్తామని చెబుతున్నారని మద్దతు ధర రూ.1,720 ప్రభుత్వమే ఇప్పించాలని డిమాండ్ చేశారు.

ఉడ్రాజవరం, పెరవలి మండలాల రైతులకు ధాన్యం సొమ్ము రూ. 22 కోట్లు రావాల్సి ఉందని, దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని సీఎం చంద్రబాబు నుంచి మంత్రుల వరకూ చెప్పారని, కానీ అది ఆచరణలో అమలు కావడం లేదని మండిపడ్డారు.  

Advertisement
 
Advertisement
Advertisement