సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌తో ఉద్యోగ సంఘాల భేటీ

Employees Union Meeting With CS Adityanath Das - Sakshi

ఉద్యోగుల పట్ల నిమ్మగడ్డ కఠినంగా వ్యవహరిస్తున్నారు

ఎన్నికల విధుల్లో పాల్గొనలేం: ఉద్యోగ సంఘాలు

సాక్షి, విజయవాడ: సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌తో ఉద్యోగ సంఘాలు శుక్రవారం భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా సీఎస్‌కు ఉద్యోగ సంఘాల జేఏసీ వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగులకు వ్యాక్సిన్‌ వేసేంత వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని సీఎస్‌కు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. చదవండి: గ్రామాల్లో అన్‌ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌: సీఎం జగన్‌

‘‘గత 10 నెలలుగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో మేం ముందు వరుసలో ఉండి పనిచేశాం. వ్యాక్సినేషన్‌ ఇస్తున్న సమయంలో ఎన్నికలకు ఎస్‌ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగుల పట్ల ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కఠినంగా వ్యవహరిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ పొందే సమయంలో ఎన్నికలు పెట్టడం సరికాదు. వ్యాక్సినేషన్‌, ఎన్నికలు రెండూ ఒకే సమయంలో ఎలా సాధ్యం. మేం వ్యాక్సినేషన్‌ తీసుకుని ఎన్నికల విధుల్లో పాల్గొనడం సాధ్యం కాదు. మాకు వ్యాక్సిన్‌ రెండు డోస్‌లు ఇచ్చాక.. ఎన్నికల విధుల్లో పాల్గొంటామని’’ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.చదవండి: విశాఖ భూ కుంభకోణం: సిట్ గడువు పొడిగింపు


Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top