విశాఖ భూ కుంభకోణం: సిట్ గడువు పొడిగింపు

SIT Deadline Extended In Visakha Land Scam - Sakshi

ఫిబ్రవరి 28 నాటికి నివేదిక సమర్పించాల్సిందిగా సిట్‌కు ఆదేశం

సాక్షి, అమరావతి: విశాఖ భూముల వ్యవహారంపై సిట్ గడువు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 28 నాటికి ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాల్సిందిగా సిట్‌ను ప్రభుత్వం ఆదేశించింది. 2019 అక్టోబరు 17న విశాఖ, పరిసర మండలాల్లో భూముల కొనుగోళ్ల వ్యవహారంపై ప్రభుత్వం.. సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ లాక్‌డౌన్‌తో సిట్ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. లాక్‌డౌన్ అనంతరం 2020 జూన్ 10 నుంచి తిరిగి సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఫిబ్రవరి 28 నాటికి నివేదిక సమర్పించాల్సిందిగా సిట్‌కు ఏపీ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top