
ఉత్పత్తి సంస్థల నుంచి యూనిట్ సగటు రేటు రూ.4.99
2023–24లో కొన్న ధరనే 2024–25కు వర్తింపజేయాలని ఏపీఈఆర్‌సీని కోరిన డిస్కంలు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్‌కు చెల్లించాల్సిన ధరలను డిస్కంలు ఖరారు చేశాయి. యూనిట్ సగటు ధర రూ.4.99గా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు 2023–24లో కొన్న ధరనే 2024–25కు వర్తింపజేయాలంటూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)ని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ వివరాలను కమిషన్ తన వెబ్‌సైట్ ద్వారా శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.
డిస్కంల ప్రతిపాదన ప్రకారం.. ఇళ్లపైన సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుచేసుకుని నెట్ మీటరింగ్ ద్వారా మిగులు విద్యుత్‌ను డిస్కంలకు అందిస్తున్న వారికి పూల్డ్‌కాస్ట్ ధర యూనిట్‌కు రూ.4.60 లభిస్తుంది. అదే విధంగా.. సెంట్రల్ గ్యాస్ స్టేషన్లు, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్లు, ఏపీ జెన్‌కో థర్మల్, హైడల్ వంటి ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించాల్సిన పూల్డ్‌కాస్ట్ ధరను కూడా డిస్కంలు ఖరారుచేసి ఏపీఈఆర్‌సీకి సమరి్పంచాయి.