ఉత్తరాంధ్రపై రామోజీ ఉన్మాదం.. | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రపై రామోజీ ఉన్మాదం..

Published Sat, Oct 21 2023 3:27 AM

Eenadu Misrepresentation of facts on Rushikonda - Sakshi

సాక్షి, అమరావతి:  టీడీపీ ప్రజాదరణ కోల్పోయింది.. చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి ఆ పార్టీ పరిస్థితి నానాటికీ పాతాళానికి పడిపోతోంది.. సానుభూ­తి పవనాలు ఎక్కడా లేవు.. పైగా అరెస్టును నిరసిస్తూ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు మైలేజీ ఇవ్వలేకపోయాయి.. ఎన్ని జాకీలు పెట్టినా ఫలితం శూన్యం. దీంతో పచ్చగ్యాంగ్‌కు పిచ్చెక్కిపోతోంది. ఒకటే మార్గం కనిపిస్తోంది.. అదీ పదేళ్లకు పైగా చేస్తున్నదే.. ఎప్పటిలాగే జగన్‌ను టార్గెట్‌ చేయడం.. ప్రభుత్వాన్ని అభాసుపాల్జేయడం.

ఇంకేముంది.. రుషికొండపై జనం సొమ్ముతో జగన్‌ సోకులు అంటూ శుక్రవారం ఈనాడు తన పైశాచిక ఆనందాన్ని మరోసారి ప్రదర్శించి విశాఖపై తన అక్కసుకు అంతులేదని చాటుకుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటే ప్రభుత్వంపై తెగ విషం చిమ్ముతోంది. ప్రగతిని అడ్డుకోవడంలో ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని దిగజారుడు రాతలు రాస్తోంది. చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా కబ్జాలు చేస్తే కన్నెత్తి చూడని, పెన్నెత్తి రాయని రామోజీ.. ఇప్పుడు ఉన్మాదంతో వెర్రెక్కిపోతున్నారు. 

బోడిగుండు రాతలు.. 
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో ఈనాడుకు కంటిమీద నిద్ర కరువైంది. అందుకే తన మార్కు వక్రీకరణ రాగం అందుకుంది. రుషికొండ బోడిగుండయ్యిందంటూ అనుమతుల విషయంలో అసత్య ప్రచారం చేసింది. కానీ, ప్రభుత్వం రుషికొండపై నిర్మాణాలు చేస్తున్న విస్తీర్ణం, వాటికున్న అనుమతులు అంకెలతో సహా చెప్పేసరికి దిమ్మతిరిగింది. అయితే.. ఎన్నడూ నిజాలను అంగీకరించని ఈనాడు.. నిస్సిగ్గుగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలకు పదును పెడుతూనే ఉంది.

ఇంతలో సీఎం జగన్‌ విశాఖ కేంద్రంగా సమీక్షలు, సమావేశాలు చేయాల్సి ఉండటంతో, అక్కడ విడిది చేసేందుకు ముఖ్యమంత్రికి, అధికారులకు, ఇతర ప్రభుత్వ శాఖలకు అవసరమైన వసతి సదుపాయాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ ప్రభుత్వ భవనాలను గుర్తించే పనిలో ఉంది. ఇందులో భాగంగానే సీఎం క్యాంపు కార్యాలయం కోసం సరైన భవనాలను అన్వేషిస్తూ రుషికొండపై నిర్మాణాలను కూడా పరిశీలిస్తోంది.

వాస్తవానికి అవి రిసార్టుల కోసం నిర్మించినవి కావడం, వాటిని సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించాల్సి వస్తే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పటివరకూ దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ, రుషికొండలో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనంటూ గుండెలు బాదుకుంటోంది. 

రుషికొండపై శాశ్వత భవనాల నిర్మాణం.. 
ఇక రుషికొండపై నిర్మిస్తున్నవి ప్రభుత్వ భవనాలే. అవి కూడా శాశ్వత భవనాలు. వాటిని టూరిజం ప్రాజెక్టులో భాగంగా పునర్మిర్మిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసింది. దాదాపు ఈ భవనాలు ఇప్పుడు పూర్తికావొచ్చాయి. కానీ, వాటిని ప్రైవేటు భవనాలుగా, ప్రైవేటు వ్యక్తుల కోసం ఉచితంగా నిర్మిస్తున్నట్లు.. వేరెవరికో దోచిపెడుతున్నట్లుగా ఈనాడు రంకెలేస్తోంది. అవి ఎప్పటికీ ప్రభుత్వ భవనాలే అన్న విషయాన్ని దాచేందుకు నానాపాట్లు పడుతోంది.

అందుకే రుషికొండలో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనని, వాటిని వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవనాల ఖర్చుతో పోల్చి బొక్కబోర్లా పడింది. నిజానికి.. గత టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.6,070 మాత్రమే ఖర్చయిందంటూ దోపిడీని తక్కువచేసి చూపించింది. వాస్తవంగా అక్కడ చ.అ.కు అయిన ఖర్చు రూ.9,166. ఆ తర్వాత కూడా మరికొంత అదనంగా ఖర్చుచేశారు.

ఈ మొత్తం కలుపుకుంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంత ఖర్చుచేసినా అవన్నీ తాత్కాలిక భవనాలే. ఈ విషయాన్ని గత ప్రభుత్వమే చెప్పింది. కేవలం తాత్కాలిక భవనాల నిర్మాణం కోసం చదరపు అడుగుకు ఎక్కడైనా ఇంత ఖర్చు చేస్తారా? పైగా ఈ భవన నిర్మాణాల్లో డొల్లతనం రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే. వర్షం నీరు కారడం, గదుల్లోకి మురుగు పొంగడం, గోడలు బీటలు వారడం చూస్తే వాటి గొప్పతనం అర్థమవుతుంది. 

కబ్జాలను దగ్గరుండి ప్రోత్సహించలేదా? 
మరోవైపు.. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని పేరుతో భూక­­బ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆధారాలు లేకుండా ఈ­నాడు క్షుద్ర రాతలు రాస్తోంది. కానీ, టీడీపీకి చెందిన మాజీ ఎంపీ, బాలకృష్ణ వియ్యంకుడు తద్వారా చంద్రబాబుకు బంధువైన ఎంవీఎస్‌ మూర్తి ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలోనే ఏకంగా 38.60 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జాచేస్తే ఈనాడు కళ్లు మూసుకుని కూర్చుంది. పైగా ఈ కబ్జా జరిగింది ఎక్కడోకాదు.. రోజూ రుషికొండ చుట్టూ తప్పుడు కథనాలు అల్లుతున్న ప్రాంతానికి సరిగ్గా ఎదురుగానే.

ఇంత జరుగుతుంటే అప్పట్లో చంద్రబాబు నోరు పెగల్లేదు.. రామోజీ పెన్ను కదల్లేదు. పైగా వారి కబ్జాలకు వత్తాసు పలికారు. కానీ, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములను కబ్జాల చెర నుంచి విడిపిస్తోంది. ఇవి తొలగిస్తుంటేనే ఈనాడు దానిని అభివృద్ధి విధ్వంసంగా చిత్రీకరిస్తోంది. వాస్తవానికి ఈ ప్రభుత్వం రుషికొండలో మొదటి విడతలో 19.39 ఎకరాలను, రెండో విడతలో 4.74 ఎకరాలను కలిపి మొత్తంగా 24.13 ఎకరాలను స్వా«దీనం చేసుకుంది. కోర్టు స్టేతో మిగిలిన భూముల స్వా«దీన ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్‌ పడింది.  

అభివృద్ధిపైనా ఈనాడు అక్కసు.. 
ఇక రుషికొండకు సమీపంలో హెలీప్యాడ్, రుషికొండ చుట్టూ గ్రావెల్‌ రోడ్డు 2019కి ముందే ఉన్నాయి. కానీ, ముఖ్యమంత్రి విలాసాల్లో భాగంగా వీటిని నిర్మించారంటూ ఈనాడు కలరింగ్‌ ఇచ్చింది. తాజాగా.. టూరిజం ప్రాజెక్టులో భాగంగా ఈ రోడ్డు మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

చివరికి ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధిని కూడా ఈనాడు జీర్ణించుకోలేకపోతోంది. ఒక ప్రాంతాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేటప్పుడు.. ప్రజల నివాసాలు వస్తున్న కొద్దీ కరెంటు, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పిస్తారు. ఇది ఏ ప్రభుత్వమైనా చేసేదే. కానీ, ఈనాడుకు మాత్రం వంకరగా కనిపిస్తోంది. 
ఎందుకంటే.. రామోజీ బుద్ధే వక్రబుద్ధి కాబట్టి!.

ప్రభుత్వ భవనాల్లో ఎక్కడైనా ఉండొచ్చు.. 
రుషికొండపై సీఎం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేస్తే ఏదో తప్పన్నట్లుగా, చట్టవిరుద్ధమైనట్లు ఈనాడు పెడ»ొబ్బలు పెడుతోంది. విశాఖపట్నం పక్క దేశంలోనో, శత్రుదేశంలోనో ఉన్నట్లు చిత్రీకరిస్తోంది. అసలు రుషికొండలో ఉన్నవన్నీ ప్రభుత్వ భవనాలేనన్న పచ్చి నిజాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతోంది. వాస్తవానికి.. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీనికి రాజ్యాంగబద్ధంగా ఆయనకు సర్వాధికారాలు ఉంటాయి. ఈ నిజాన్ని ఈనాడు అంగీకరించదు. 

Advertisement
 
Advertisement
 
Advertisement