తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం | Devotee Rush Continues at Tirumala, 18-Hour Wait for Sarva Darshan | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

Sep 21 2024 7:21 AM | Updated on Sep 21 2024 8:51 AM

Devotee Rush Continues at Tirumala, 18-Hour Wait for Sarva Darshan

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,104 మంది స్వామివారిని దర్శించుకోగా 28,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.25 కోట్లు సమర్పించారు.

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8  కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు, దర్శనానికి 5 గంటల సమయం. టిక్కెట్లు లేని భక్తులకు 18  గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది.

ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలైన్‌లో అనుమతించారని తెలుపుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement